Writing With Fire: భారత్ నుంచి ఆస్కార్‌కు ఒక్కటే.. “రైటింగ్ విత్ ఫైర్”!

ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల 94వ అకాడమీ అవార్డుల నామినేషన్ల కార్యక్రమం ముగిసింది.

Writing With Fire: భారత్ నుంచి ఆస్కార్‌కు ఒక్కటే.. “రైటింగ్ విత్ ఫైర్”!

Writing With Fire

Writing With Fire: ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల 94వ అకాడమీ అవార్డుల నామినేషన్ల కార్యక్రమం ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వందల చిత్రాలు స్క్రీనింగ్‌‌కి రాగా, భారతీయ సినిమాలకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించిన సూర్య జైభీమ్, మోహన్‌లాల్ నటించిన మరక్కర్ ఫైనల్ నామినేషన్‌లోకి వెళ్లలేకపోయాయి.

అయితే, కోట్ల మంది భారతీయుల ఆస్కార్ ఆశలను సజీవంగా ఉంచేలా ఓ డాక్యుమెంటరీ మాత్రం ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది. భారతీయ కథా ఆధారిత డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో స్థానాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం భారతీయ దళిత మహిళలు ప్రచురించిన ‘ఖబర్ లహరియా’ వార్తాపత్రిక ఆధారంగా రూపొందించబడింది.

థామస్, సుష్మిత్ ఘోష్ దర్శకత్వం వహించిన “రైటింగ్ విత్ ఫైర్” భారతదేశంలోని దళిత స్త్రీలు నిర్వహించే ఏకైక వార్తాపత్రిక “ఖబర్ లహరియా” కథా నేపధ్యంలో తెరకెక్కింది. ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు మార్చి 27న అట్టహాసంగా జరగనున్నాయి.

“రైటింగ్ విత్ ఫైర్” డాక్యుమెంటరీ విషయానికి వస్తే, భారత్‌లోని ఉత్తరాధి ప్రాంతంలో మహిళా రిపోర్టర్లు, దళిత మహిళు ఎన్నో ఏళ్లుగా అన్నీ తామై పత్రికను ఎలా నడిపిస్తున్నారు అనేది ఈ డాక్యుమెంటరీ నేపధ్యం. కుల వివక్షను ఎదుర్కొని వార్తలను ఎలా సేకరించారు. ఎలా సేకరిస్తున్నారు. అనేవి ఇందులో ప్రధానాంశాలు.