Shaitan Trailer : బోల్డ్ సిరీస్‌తో యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ్.. ‘సైతాన్’ ట్రైలర్‌లో సెన్సార్ పదాలు!

యాత్ర వంటి మంచి బయోపిక్ ని, సేవ్ ది టైగర్స్ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహి వి రాఘవ్.. ఇప్పుడు 'సైతాన్' అనే బోల్డ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.

Shaitan Trailer : బోల్డ్ సిరీస్‌తో యాత్ర డైరెక్టర్ మహి వి రాఘవ్.. ‘సైతాన్’ ట్రైలర్‌లో సెన్సార్ పదాలు!

Yatra 2 director Mahi V Raghav Shaitan Trailer released

Mahi V Raghav – Shaitan Trailer : ‘యాత్ర’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్న డైరెక్టర్ మహి వి రాఘవ్.. ఒక పక్క యాత్ర 2 అంటూ కొత్త సినిమాలు ప్రకటిస్తూనే, మరోపక్క వెబ్ సిరీస్ తో కూడా దూసుకుపోతున్నాడు. ఇటీవల సేవ్ ది టైగర్స్ (Save The Tigers) అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ ఇప్పుడు బోల్డ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ‘సైతాన్’ అనే క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

Allu Arjun : బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసిన స్నేహారెడ్డి.. ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా?

వెన్నులో వణుకు పుట్టించే క్రైమ్, వయలెన్స్ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘మీరు దీనిని నేరం అని అంటే.. వాళ్ళు మనుగడ కోసం అని అంటారు’ అనే థీమ్ లో సైతాన్ సాగుతుందని ఆల్రెడీ తెలిపారు. థీమ్ కి తగ్గట్లుగానే ట్రైలర్ కూడా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ తమ మనుగడ కోసం క్రైమ్స్ మొదలు పెట్టింది అనేది ఈ చిత్ర కథ. ఇందులో రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటించారు.

Sonal Chauhan : బాలీవుడ్‌ని ‘ఆదిపురుష్’కు ముందు ‘ఆదిపురుష్’కు తర్వాతగా చూస్తాం.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

ట్రైలర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. “సైతాన్ అనేది క్రైమ్ డ్రామా. ఇంతకు ముందు మేము డిస్ని ప్లస్ హాట్ స్టార్ కోసం సేవ్ ది టైగెర్స్ కోసం పనిచేశాం. సైతాన్ అనేది కంప్లీట్ గా డిఫెరెంట్ ప్రాజెక్ట్. క్రైమ్ చిత్రాలు, వెబ్ సిరీస్ ఇష్టపడే వారి కోసం టార్గెట్ చేసి తెరకెక్కించాం. గతంలో నేను నాలుగైదు చిత్రాలు తెరకెక్కించా. ఏ చిత్రానికి కూడా న్యూడిటీ, అభ్యంతరకర డైలాగ్స్ లాంటి సెన్సార్ సమస్య రాలేదు. కానీ సైతాన్ లో అన్నీ ఉన్నాయి. మీరు ట్రైలర్ చూస్తే.. ఇలాంటి బలమైన కథ చెప్పేందుకు ఆ పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. ఇక మా నటీనటుల గురించి చెప్పాలంటే వారు ఎంతో ఫ్యాషన్ తో వర్క్ చేశారు. ఈ కథకు తగ్గట్లుగా ముందుగానే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళతో కలసి పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్” అని మహి వి రాఘవ్ అన్నారు.