Aadi: ‘పులి-మేక’ ఆటాడుతున్న ఆది, లావణ్య!
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తున్న ZEE5....

Aadi: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా అందిస్తున్న ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫాం.. ప్రారంభం నుండే ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ZEE5 కంటెంట్ పరంగా చూస్తే ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో దూసుకుపోతుంది. ZEE5 ఒక జోనర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఫార్మాట్లకు ప్రసారం చేసే విధంగా సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్‌ను వీక్షకులకు అందించనుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుండి కామెడీ డ్రామా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ‘లూజర్ 2’, BBC స్టూడియోస్ మరియు నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ నుండి ‘గాలివాన’, ఇటీవల ‘రెక్కీ’తో జీ5 మంచి హిట్‌ను అందుకుంది. ఇప్పుడు తాజాగా “పులి – మేక” అనే కొత్త వెబ్ సిరీస్‌ను లాంఛ్ చేసింది జీ5.
Aadi : టాప్ గేర్‌లో దూసుకుపోతున్న ఆది సాయికుమార్..
జీ5 అసోసియేషన్ విత్ కోన ఫిలిం కార్పోరేషన్ చేస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ “పులి – మేక”. ఈ వెబ్ సిరీస్‌లో అందాల భామ లావణ్య త్రిపాఠి, యంగ్ హీరో ఆది సాయికుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నారు. గోపీచంద్ హీరోగా ‘పంతం’ చిత్రానికి దర్శకత్వం వహించిన కె.చక్రవర్తి రెడ్డి మెగాఫోన్ పట్టారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మరియు జీ5 సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ‘పులి – మేక’ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచాన్ చేశారు.
Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య
పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ… ఈ మధ్య వెబ్ సిరీస్‌లు కూడా సినిమాలతో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగావెబ్ సిరీస్‌లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ ‘పులి-మేక’ వెబ్ సిరీస్‌లలో లావణ్య త్రిపాఠి, ఆదిసాయి కుమార్, సుమన్ తదితరులు నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ “పులి – మేక” వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది. పోలీస్ డిపార్టుమెంట్‌లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న ఒక సీరియల్ కిల్లర్ నేపథ్యంలో థ్రిల్లర్ అంశాలు మరియు ఆస్ట్రాలజీతో మిళితమైన కథాంశం ఉండటం ఈ వెబ్ సిరీస్ కథలో ఉన్న ప్రత్యేకత. ఇప్పటి వరకు వచ్చిన వెబ్ సిరీస్లలాగే ఇది కూడా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
1MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
2Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
3Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
4Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
5Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
6London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
7Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
8Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
9Telangana Covid Figure : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
10Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?
-
Hangover : హ్యాంగోవర్ ను తగ్గించే తేనె!