విజృంభిస్తోన్న కరోనా..రిమాండ్ ఖైదీలకు సోకిన వైరస్

కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కరోనా కేసులు నమోదు కావడంతో రామనగర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రామనగర జైలులోని ఐదు బ్యారక్ లలో 25 మంది చొప్పున రిమాండ్ ఖైదీలను ఉంచారు.

వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదు మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో తోటి ఖైదీలకు కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు కనిస్తున్నాయి. అదే విధంగా వారితో పాటు సన్నిహితంగా మెలిగిన పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది, జైలు సిబ్బందికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా జైలు అధికారులు వెంటనే నగర సభ అధికారులకు ఫోన్ చేసి మాస్కులు, శానిటైజర్లు తెప్పించుకున్నారు.

భారత దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృతులు కూడా అంతకంతకూ పెరుగుుతున్నారు. దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 24 వేల 596కు చేరింది. 779 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా 18 వేల 668 యాక్టివ్ కేసులు ఉండగా, 5 వేల 192 మందికి నయం కావడంతో వారిని డిశ్చార్జ్ చేశారు.

మహారాష్ట్రలో 6 వేల 817 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 301 మంది కరోనా బాధితులు మృతి చెందారు. గుజరాత్ లో 2 వేల 815 కేసులు నమోదు కాగా, 127 మంది మృతి చెందారు. రాజస్థాన్ లో 2 వేల 34 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారిన పడి 27 మంది మరణించారు. తమిళనాడులో 1755 కరోనా కేసులు నమోదు కాగా, వీటిలో 31 చిన్నారులు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 22 మంది మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది.  29 మంది మృతి చెందారు.