12రాష్ట్రాల్లో 80శాతం కరోనా కేసులు.. పెరిగిన మరణాల శాతం

12రాష్ట్రాల్లో 80శాతం కరోనా కేసులు.. పెరిగిన మరణాల శాతం

12 States Account For Over 80 Of Active Coronavirus Cases

కరోనా మహమ్మారి దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ఫస్ట్ వేవ్ కంటే విపరీతంగా కేసులు పెరిగిపోగా.. లక్షల్లో కొత్త కేసులు.. వేల‌ల్లో మ‌ర‌ణాలు వస్తున్నాయి. నాలుగు లక్ష‌ల‌కుపైగా కొత్త కేసులు రోజుకు వెలుగులోకి వస్తుండగా.. 12 రాష్ట్రాల్లోనే 80 శాతానికిపైగా కేసులు ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించింది.

కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వివరాల ప్ర‌కారం.. దేశం మొత్తంలో ప్ర‌స్తుతం 37.23 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయని, అందులో 80.68 శాతం కేసులు కేవ‌లం 12 రాష్ట్రాల నుంచే ఉన్నట్లు చెప్పారు. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 6.57ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 5,36,661 యాక్టివ్ కేసుల‌తో క‌ర్ణాట‌క, 4,02,997 యాక్టివ్ కేసుల‌తో కేర‌ళ‌, 2,54,118 యాక్టివ్‌ కేసుల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, 1,99,147 యాక్టివ్‌ కేసులతో రాజ‌స్థాన్ ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, హ‌ర్యానా, బీహార్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరణాల రేటు కూడా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకండ్ వేవ్‌లో ఎక్కువ అయ్యాయి. మ‌ర‌ణాల రేటు 1.09శాతంగా అయ్యింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య సుమారు 2.19 కోట్ల‌కు చేర‌గా.. అందులో మ‌ర‌ణాల రేటు 1.09 శాతంగా ఉన్న‌దని అంతకుముందు ఒక్క శాతం కంటే తక్కువగా ఉన్న మరణాల రేటు పెరిగిందని చెబుతోంది కేంద్రం.