Delhi Police: పోలీసులను టెస్ట్ చేసేందుకు ఢిల్లీ అంతా డమ్మీ బాంబులు

దేశ రాజధానిలో పోలీస్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్‌నెస్ పరీక్షించడానికి డమ్మీ బాంబులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సంచారం ఉన్న చోటే ఏర్పాటు చేయగా పబ్లిక్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ పోలీసులు కలిసి 12 గుర్తించారు.

Delhi Police: పోలీసులను టెస్ట్ చేసేందుకు ఢిల్లీ అంతా డమ్మీ బాంబులు

Delhi Police

 

Delhi Police: దేశ రాజధానిలో పోలీస్ డిపార్ట్‌మెంట్ అలెర్ట్‌నెస్ పరీక్షించడానికి డమ్మీ బాంబులు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో జన సంచారం ఉన్న చోటే ఏర్పాటు చేయగా పబ్లిక్, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ పోలీసులు కలిసి 12 గుర్తించారు. ఢిల్లీ, ముంబై, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్లకు గానూ ఆల్ ఖైదా సూసైడ్ బాంబులకు పాల్పడతామని హెచ్చరించింది.

వీటి నుంచి ముందే అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం.. ఈ డమ్మీ IED డ్రైవ్ నిర్వహించింది.

రీసెంట్ క్రైమ్ రివ్యూ మీటింగ్ లో స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలిస్ హర్‌గోవిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ.. ఇటువంటి ఎక్సర్‌సైజెస్ జరుగుతూనే ఉంటాయని అన్నారు. తొలి బ్యాచ్ తో జూన్ 12న 15డమ్మీ ఐఈడీలు ఢిల్లీల్లోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేయించామని వాటిలో 10 గుర్తించగలిగారని వెల్లడించారు. వాటిలో రెండింటిని పబ్లిక్ గుర్తించగా, ఐదింటిని లోకల్ పోలీసులు, మూడింటిని సెక్యూరిటీ గార్డులు గుర్తించినట్లు తెలిపారు.

Read Also : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

ఆ తర్వాత మళ్లీ మరో 15 ఐఈడీ(ఇంప్రూవైజ్‌డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లను జూన్ 28న ఏర్పాటు చేశారు. కానీ, ఈ సారి 13 డివైజ్ లను గుర్తించలేకపోగా.. రెండు మాత్రమే కనుగొన్నారట. అవి కూడా పూల కుండీలో, మాల్ చెత్తకుండీలో దొరికినట్లు ధాలివాల్ అన్నారు.