Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను  సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ నార్కొటిక్‌ వింగ్‌ పోలీసులు పట్టుకున్నారు.

Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

Cv Anand

Drugs :  ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ కు మాదక ద్రవ్యాలను  సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్‌ నార్కొటిక్‌ వింగ్‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువ చేసే 20గ్రాముల కొకైన్‌, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.  ఈ ముఠాకు చెందిన మరో  17 మందికోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.

హైదరాబాద్‌లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను ఆర్డర్‌పై సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతర్జాతీయ నెట్వర్‌కు చెక్ పెట్టారు. తాజాగా రెండు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు పట్టుకున్నారు.

డ్రగ్స్ ముఠాలు ఆన్‌లైన్ ద్వారానే డ్రగ్స్ క్రయవిక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లో వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తున్న ఐదుగురు ఆఫ్రికన్లను గుర్తించి వారి దేశాలకు పంపించారు హైదరాబాద్ సిటీ పోలీసులు.

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు మెట్రో నగరాలనే టార్గెట్ గా చేసుకుని దందా నడిపిస్తున్నారు. పోలీసులనే  బురిడి   కొట్టించే విధంగా డ్రగ్స్ దందా బిజినెస్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్ నెషనల్ డ్రగ్స్ మాఫియా దందా చూసి పోలీసులే అవాక్కవుతున్నారు.  నైజీరియా, టాంజానీయ, యేమెన్ దేశాలకు చెందిన ఎబుకా సుజీ, హెన్రీ చిగ్బో, అమోబి చువుడి తోపాటు 17 మంది డ్రగ్స్ కస్టమర్లు డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇందులో హెన్రీ చిగ్బో, అమోబి చువుడి లు మాత్రమే ఈరోజు పోలీసులకు దొరికారు. మిగత వారు పరారీలో ఉన్నట్లు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

ఈముఠా సభ్యులు బిజినెస్ వీసా పేరుతో దేశంలోకి వచ్చి వీసా గడువు ముగిసిపోయిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటూ… డ్రగ్స్ దందాకు తెరలేపుతున్నారు. ముఠా సభ్యులు సెల్‌ఫోన్లో కొన్ని యాప్‌లను డౌన్ లోడ్ చేసుకుని డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అంతేకాదు ఎయిర్ పోర్టుల ద్వారా డ్రగ్స్ దిగుమతులు చేసుకుంటున్నారని సీవీ ఆనంద్ వివరించారు.

ఒక్క గ్రామ్ డ్రగ్స్ ను సుమారు 10 వేల వరకు విక్రయిస్తున్నారు. అలాగే మరో డ్రగ్స్ ముఠాలోని కమల్ అమ్మద్, మతియాస్ శావ లను కూడా అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారిలో ఉన్నారు. రెండు ముఠాల నుంచి 20 గ్రాముల కొకైన్, 110 గ్రాముల మెతాపెటమైన్ డ్రగ్స్ తోపాటు ఐదు సెల్ పోన్లన స్వాదీనం చేసుకుని రిమాండ్ కి తరలించారు.

అలాగే హైదరాబాద్ లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులపై పోలీసులు కొరడా ఝళిపించారు. ఆఫ్రికాకు చెందిన   ఐదుగురు వీదేశీయులు బిజినెస్, స్టడీ వీసాలపై దేశంలోకి వచ్చారు. వీసా గడువు పూర్తి అయినా నగరంలోనే అక్రమంగా తిష్ట వేసి… ఇల్లీగల్ యాక్టీవిటీస్‌కి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఐదుగురిని అదుపులోకి తీసుకున్ని ఎఫ్‌ఆర్‌ఆర్‌వో సహాకారంతో వారిని వారి దేశాలకు పంపిస్తున్నారు పోలీసులు.

నగరంలో సుమారు 750 మంది వీసా గడువు అయిపోయిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటున్నారని వారందరిని గుర్తించి వారివారి స్వదేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోలీసు కమీషనర్. ఇప్పటికే డ్రగ్స్ నియంత్రణ కోసం నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పుడు అక్రమంగా నగరంలో నివాసం ఉంటూ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు పాల్పడుతున్న విదేశీయులపై స్పెషల్ ఫోకస్ పెడుతామంటున్నారు.

Also Read : Mamata Banerjee: ప్ర‌తిప‌క్షాల‌ను బెదిరించేందుకు సీబీఐని ప‌దేప‌దే వాడుతున్నారు: మ‌మ‌త‌