Covid Deaths : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి..దేశంలో 577మంది పిల్లలు అనాథలయ్యారు : మంత్రి స్మృతి ఇరానీ

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి 577మంది పిల్లలు అనాథలయ్యారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాలు పెగుతున్న క్రమంలో చిన్నారుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది.

Covid Deaths : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి..దేశంలో 577మంది పిల్లలు అనాథలయ్యారు : మంత్రి స్మృతి ఇరానీ

577 Children Orphaned Due To Covid

577 children orphaned due to covid  : కరోనా కాటుకు కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయి. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మారుతున్న అత్యంత విషాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. బిడ్డల్ని కోల్పోయిన తల్లులు..తల్లులను పోగొట్టుకున్న పిల్లలు ఇలా కరోనా ప్రభావానికి కుటుంబాలకు కుటుంబాలే విషాదాల్లో మునిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా సోకి తల్లిదండ్రులకు కోల్పోయిన పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.

వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఓ పక్క ప్రభుత్వాలు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందిస్తామని చెబుతున్నాయి. కానీ ఇది ఎంత వరకూ అమలు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభుత్వం చేసే సహాయం తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల భవిష్యత్తుకు ఎంత వరకూ సరిపోతుందనేది ఆలోచించాల్సిన అవసరముంది.

దేశంలో పరిస్థితులు ఇలా ఉంటే..దేశ వ్యాప్తంగా కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లు వందల సంఖ్యలో ఉన్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ‌ల్ల త‌ల్లితండ్రులు చ‌నిపోవ‌డంతో సుమారు 577 మంది చిన్నారులు అనాథ‌లుగా మారారని స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి మంగ‌ళ‌వారం (మే 25.5.2021)వ‌ర‌కు ఈ నివేదిక ఉన్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు.

కోవిడ్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన పిల్ల‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు, యూటీలు ఇచ్చిన స‌మాచారం మేర‌కు 577 మంది చిన్నారులు అనాథ‌లయ్యారని తెలిపారు. జిల్లా అధికారులు అనాథలైన పిల్ల‌ల సంర‌క్ష‌ణ చూసుకుంటార‌ని అన్నారు. త‌ల్లితండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌కు సైకలాజిక‌ల్ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నిమ‌హ‌న్స్ రెడీగా ఉంద‌న్నారు. ఇలాంటి చిన్నారుల‌ను చూసుకునేందుకు ప్ర‌భుత్వం వ‌ద్ద ఎటువంటి నిధుల కొర‌త లేద‌ని మంత్రి స్పష్టంచేశారు.