60 సెకన్లలో విచారణ.. అయోధ్య కేసు వాయిదా

ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 06:53 AM IST
60 సెకన్లలో విచారణ.. అయోధ్య కేసు వాయిదా

ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

  • జనవరి 10కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ: ఆరు దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వివాదాస్పద అయోధ్య కేసు మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అయోధ్య కేసుపై విచారణ ప్రారంభమైంది.

అయితే కేవలం 60 సెకన్లలోనే అయోధ్య కేసును వాయిదా వేస్తున్నట్టు బెంచ్ వెల్లడించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ తో కూడిన ధర్మాసనం అయోధ్య కేసుపై ఎలాంటి వాదనాలు వినకుండానే తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేసింది.