Cow Dung Rakhis: ఆవుపేడతో తయారైన రాఖీలు.. విదేశాలకు ఎగుమతి

మన దేశంలో స్వచ్ఛమైన ఆవు పేడతో రాఖీలను కూడా తయారు చేస్తున్నారు. అంతేకాదు.. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి అమెరికా, మారిషస్‌కు ఇటీవల దాదాపు 60,000కు పైగా రాఖీలు ఎగుమతయ్యాయి.

Cow Dung Rakhis: ఆవుపేడతో తయారైన రాఖీలు.. విదేశాలకు ఎగుమతి

Cow Dung Rakhis: స్వచ్ఛమైన ఆవు పేడతో తయారైన రాఖీలకు మంచి గిరాకీ ఉంటోంది. ఇండియా నుంచి ఇటీవల దాదాపు 60,000కు పైగా ఇలాంటి రాఖీలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఆర్గానిక్ ఆవు పేడతో తయారు చేసిన 40,000 రాఖీలు అమెరికాకు, మరో 20,000 రాఖీలు మారిషస్‌కు జైపూర్ నుంచి ఎగుమతయ్యాయి.

ISRO Satellites: నిరుపయోగంగా శాటిలైట్లు.. ఇస్రో ప్రకటన

విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా రాఖీ పండుగను ఘనంగా జరుపుకొంటారు. అక్కడుండే వాళ్లు మన దేశంలో ఆర్గానిక్ ఆవుపేడతో తయారయ్యే రాఖీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి సహజసిద్ధమైనవి కావడంతో పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. అందువల్ల ఇలాంటి రాఖీలపై చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఆర్గానిక్ ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన అతుల్ గుప్తా ఈ వివరాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మన దేశంలో ఉత్పత్తయ్యే ఆర్గానిక్ ఆవు పేడకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. కొన్ని నెలల క్రితం 192 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఆవు పేడను జైపూర్ నుంచి కువైట్‌కు ఎగుమతి చేశారు. అలాగే ఈ సంస్థకు చెందిన మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సంగీతా గౌర్.. ఆవు పేడతో తయారైన రాఖీల గురించి వివరించారు. ఈ రాఖీలకు మన దేశంతోపాటు విదేశాల్లోనూ మంచి ఆదరణ ఉందన్నారు.

Gilli Danda: ‘ఖోఖో, గిల్లీ దండా’తోపాటు 75 క్రీడలకు స్కూళ్లలో చోటు.. కేంద్రం నిర్ణయం

ఆవుపేడతోపాటు, విత్తనాలతో తయారైన హెర్బల్ రాఖీలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులను గోవుల సంరక్షణకు వినియోగిస్తామన్నారు. వీటి తయారీ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయని, చైనా రాఖీలకు బదులు దేశీయ రాఖీలు వాడేందుకు ఎందరో ఆసక్తి చూపుతున్నారని ఆమె అన్నారు. ఈ రాఖీలు రేడియేషన్ నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని సంగీత చెప్పారు.