8 km long rangoli : ఓటు విలువ తెలిపే 8 కిలోమీటర్ల రంగోలి : భారతదేశంలో అతి పొడవైన రంగవల్లిక

8 km long rangoli : ఓటు విలువ తెలిపే 8 కిలోమీటర్ల రంగోలి : భారతదేశంలో అతి పొడవైన రంగవల్లిక

8 Km Long Rangoli Made In Assam

8 km long rangoli made in Assam to create awareness among voters : అస్సోంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు అసోంలోని సిల్​చార్​లో 8 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. కచర్ జిల్లా ప్రధాన కేంద్రం సిల్​చార్​లో 8.13 కిలోమీటర్లు పొడవైన రంగోలీని తీర్చిదిద్దారు. డిప్యూటీ కమిషనర్​గా పనిచేస్తున్న యువ ఐఏఎస్​ అధికారి కీర్తి జల్లి నేతృత్వంలో నిర్వహించిన ఈ క్రతువులో సుమారు 3 వేల మంది పాలుపంచుకోవడం విశేషం.

విద్యార్థులు, టీచర్లు, తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్​ అధికారులు, సైనిక సిబ్బంది ఇలా ఈ రంగవల్లికను తీర్చిదిద్దే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అన్ని వర్గాల వారు మమేకమైన ఈ కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా మారింది.ఆదివారం (మార్చి 14,2021) ఉదయం మొదలుపెట్టి 24 గంటల్లో ఈ 8.13 కిలోమీటర్ల సుదీర్ఘ రంగవల్లికను రూపొందించారు.

ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఓటింగ్​లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని కాచార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి తెలిపారు. ఇప్పటివరకు 4 కి. మీ రంగోలీనే భారత్​లో అత్యంత పొడవైనదిగా ఉందని, ఇప్పుడు ఈ రంగోలీతో ఆ రికార్డును అధిగమించామని కీర్తి తెలిపారు.