Spicy Bath : 108 కేజీల కారం నీళ్లతో పూజారి స్నానం..మద్యం,సిగరెట్లు దేవుడికి సమర్పించే వింత ఆచారం

భారత్ దేశంలో ఉండే ఎన్నో దేవాలయాల్లో వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పెరియప్ప స్వామి దేవాయలంలో పూజారి 108 కేజీల కారం పొడి కలిపిన నీళ్లతో స్నానం చేసే ఆచారం కూడా అటువంటిదే. ప్రతీ ఏటా కొనసాగే ఈ వింత ఘటన చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు.

Spicy Bath : 108 కేజీల కారం నీళ్లతో పూజారి స్నానం..మద్యం,సిగరెట్లు దేవుడికి సమర్పించే వింత ఆచారం

Priest Bathes In Water Mixed With 108 Kg Of Chilli Powder

కూరలో కారం కొంచెం ఎక్కువైతే చాలా ఆగమైపోతాం. కానీ ఓ గుడిలో న్నో ఏళ్లగా కొనసాగుతున్న వింత ఆచారం గురించి వింటే ఒల్లు గగుర్పొడుస్తుంది. ఓ గుడిలో పూజారి కారం నీళ్లతో స్నానం చేస్తారు. ఈ వింత ఆచారం చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ప్రతీ సంవత్సరం ఆదివారం ఆది అమావాస్య రోజున తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని నడపనహళ్లి గ్రామంలోని గుడిలో పూజారి ఏకంగా 108 కేజీల కారం కలిపిన నీళ్లు తో స్నానం చేస్తారు. ప్రతి ఏటా ఆది అమావాస్య రోజున సామూహిక వేడుకలు జరుగుతాయి. గ్రామ దైవం పెరియ కరుప్పసామికి పాలు, కారంపొడితో అభిషేకం చేస్తారు. అంతేకాదు పెరియ కురుప్పస్వామికి భక్తులు మద్యం, సిగరెట్లు సమర్పిస్తారు. ఈ వింత ఆచారం ఆశ్చర్యం కలిగించిని ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అంతటి కారం నీళ్లతో స్నానం చేసిన ఆ పూజారికి శరీరం ఏమాత్రం బాధించదట. ఏమాత్రం మంట అనేదే ఉండదట. అదంతా పెరియప్ప స్వామి మహిమేనంటారు భక్తులు.

ఈ ఆచారంలో భాగంగా గ్రామ దైవానికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు పూజారి..ఆ తరువాత పూజారి గోవిందం రెండు కొడవళ్లపై నిలబడి భక్తుల సమస్యలను వింటారు. ఆ తర్వాత ‘కారం యజ్ఞం’లో పాల్గొంటారు. కొడవలి పట్టుకుని కూర్చొనే ఆయనపై 108 కేజీల కారం కలిపిన నీళ్లను భక్తులు పూజారి తలపై నుంచి పోసి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం వల్ల తమలో దుష్టశక్తులు, దురదృష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్ముతారు.

కాగా, భక్తులు కారం నీళ్లు పోసేంత వరకు పూజారి గోవిందం కదలకుండా మెదలకుండా ఉంటారు. మరోవైపు ఆ కారం ఘాటు వల్ల ఊపిరి పీల్చలేక భక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ పూజారి మాత్రం ఏమాత్రం ఇబ్బంది అనేదే లేకుండాచక్కగా ఏదో చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లుగానే ఉంటారు. ఆ తరువాత పూజారి శరీరంపై కారం మరకలు పోయేంత వరకు నీటిని భక్తులు ఆయనపై గుమ్మరిస్తారు. ఇలా చేస్తే గ్రామానికి మంచి జరగడం నమ్మకమే అయినా..కారం నీళ్లతో స్నానం చేయడం పూజారి అదొక బాధ్యతగా..భక్తిగా చేయటం గమనించాల్సిన విషయం. ఇటువంటి వింత ఆచారాలు మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈనాటికి కొనసాగుతుండటం మరో విశేషం.