Sonu Sood Oxygen : కరోనా కష్టకాలంలో సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం, దేశమంతా ఫ్రీ

కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

Sonu Sood Oxygen : కరోనా కష్టకాలంలో సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం, దేశమంతా ఫ్రీ

Sonu Sood Oxygen

Sonu Sood Oxygen : కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపిన ఆయన.. తాజాగా దేశమంతా ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. www.umeedbysonusood.com వెబ్ సైట్ లో ఆక్సిజన్ ఎక్కడికి పంపాలో చెబితే.. డీటీడీసీ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపుతానని సోనూసూద్ తెలిపారు.

ఆక్సిజన్ సిలిండర్స్ కోసం దేశమంతా ఆర్తనాదాలు వినిపిస్తుండడంతో ఎవరు ఎంత దూరం నుంచి అడిగినా ఆక్సిజన్ సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో ఎవరికి అవసరం ఉన్నా.. ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. సోనూసూద్ ఈ నిర్ణయంతో.. సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గతేడాది కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కష్టంలో ఉన్న ఎందరికో సోనూసూద్ సాయం చేస్తూ వస్తున్నారు. డబ్బు లెక్క చేయకుండా సొంత ఖర్చులతో నిర్విరామంగా.. కష్టాలలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. ఇక సెకండ్ వేవ్‌లో సోనూసూద్ చేస్తున్న సహాయ కార్యక్రమాల లెక్కలేనన్ని. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సాయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తున్నారు. అన్నట్లుగానే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను జెట్ స్పీడ్‌లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నారు. సెకండ్ వేవ్ లో బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లు.. ఇలా ఏది అడిగితే అది బాధితులకు వెంటనే సాయం చేసి వారి ప్రాణాలు నిలుపుతున్నాడు సోనూసూద్. అందుకే, కరోనా కష్టకాలంలో ఈ పేరు భారతదేశంలో కొండంత నమ్మకాన్ని భరోసాని కల్పిస్తోంది.

www.umeedbysonusood.com…ఓ చాట్ బోట్.. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు అవసరం అయిన పేషెంట్లు తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఆపై ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ ను మీ ఇంటికి తెచ్చి ఇస్తారు. అదీ ఉచితంగానే. సోనూసూద్ చారిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సర్వీస్ నడుస్తుంది.