Adani Group: ఎన్డీటీవీ ప్రమోటర్ల అదనపు 27.26% వాటాను కొనుగోలుచేసిన అదానీ గ్రూప్ ..

బిలియనీర్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. తాజాగా శుక్రవారం.. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్, రాధిక రాయ్‌ల అదనపు 27.26శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ మెజార్టీ వాటాను 64.71శాతం కలిగి ఉంది.

Adani Group: ఎన్డీటీవీ ప్రమోటర్ల అదనపు 27.26% వాటాను కొనుగోలుచేసిన అదానీ గ్రూప్ ..

Adani

Adani Group: బిలియనీర్ గౌతమ్ అదానీ ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను దక్కించుకున్నారు. తాజాగా శుక్రవారం.. ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్, రాధిక రాయ్‌ల అదనపు 27.26శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాని పరోక్ష అనుబంధ సంస్థ ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ద్వారా రూ. 602 కోట్లకు 27.26శాతం వాటాను కొనుగోలు చేసింది. దీంతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ వాటా 64.71శాతంకు చేరి మెజార్టీ వాటాను కలిగి ఉంది.

Adani Group To Buy NDTV : మీడియా రంగంలోకి అదానీ.. NDTV‌ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు

ఆర్ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రారంభంలో ఒక ప్రమోటర్ గ్రూప్ కంపెనీ, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ఈ ఏడాది ఆగస్టులో వారెంట్లను మార్చడం ద్వారా కొనుగోలు చేసింది. కొనుగోలు తర్వాత అదానీ గ్రూప్ ఎస్ఈబీఐ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా అదనంగా 26శాతం ఎన్డీటీవీని కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ ను ప్రకటించింది. అయితే దాని హోల్డింగ్ ను 37.45శాతంకు పెంచింది. డిసెంబర్ 23న ఎన్డీటీవీలో రాయ్స్ కేవలం 5% మాత్రమే ఉంచుతూ తమ వాటాలో కొంత భాగాన్ని అదానీ గ్రూప్‌కు విక్రయించే ప్రణాళికను ప్రకటించారు. నాలుగు బ్లాక్‌ల డీల్స్‌లో శుక్రవారం ఉదయం వాటా బదిలీ జరిగింది.

Gautam Adani: మోదీ కాదట, రాజీవ్ గాంధీనట.. పారిశ్రామికవేత్తగా తన ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గౌతమ్ అదానీ

శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు బీఎస్ఈలో ఎన్డీటీవీ షేర్లు ఒక్కొక్కటి రూ. 347.1 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో శుక్రవారం ట్రేడ్స్ విలువ ప్రకారం.. ఎన్డీటీవీలో ప్రణయ్, రాధిక రాయ్స్ అదనపు 1.76 కోట్ల షేర్‌లను సుమారు 602 కోట్లకు (ఒక్కో షేర్ రూ. 342.65) కొనుగోలు చేసింది. కంపెనీలో దీనివాటా 27.26 శాతం. ఈ వాటా కొనుగోలుతో ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 64.71శాతం మెజార్టీ వాటాను కలిగిఉంది.