Gujarat: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో 60 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ప్రత్యే కోర్టు

గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన 11 మందికి ఉపశమనం లభించిన తర్వాత తాజా నిర్దోషిగా ప్రకటించడం పెద్ద రాజకీయ తుఫానును లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

Gujarat: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో 60 మందిని నిర్దోషులుగా విడుదల చేసిన ప్రత్యే కోర్టు

Naroda Gam massacre case accuses

Gujarat: గుజరాత్ రాష్ట్రంలో 2002 లో చేలరేగిన అల్లర్ల సమయంలో నరోదా గామ్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు మాయా కొద్నానీ, బజరంగ్ దళ్‌కు చెందిన బాబు బజరంగి సహా 60 మంది నిందితులను నిర్దోషులుగా అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు ప్రకటిస్తూ విడుదల చేసింది. అహ్మదాబాద్‌ నగరంలోలోని నరోదా గామ్‌లో ఇళ్లకు నిప్పుపెట్టి 11 మంది ముస్లింలు మరణానికి వీరు కారణమయ్యారని అప్పట్లో కేసులు మోపి అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుపై గురువారం తుది విచారణ చేపట్టిన అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు.. వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.

Prayagraj: అతీక్ అహ్మద్ మర్డర్ కేసులో సీన్ రీక్రియేట్ చేసిన జ్యూడీషియల్ కమిషన్

2017లో విచారణ సందర్భంగా కోద్నానీకి సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోర్టు ముందు హాజరయ్యారు. 2002లో సబర్మతి కోచ్ దహనం తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో (అప్పుడు నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి) నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా ఉన్నారు. “నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. తీర్పు కాపీ కోసం మేము ఎదురుచూస్తున్నాము” అని నిర్దోషులుగా విడుదలైన వారి తరపు న్యాయవాది ఎస్‌కే బాక్సీ ప్రత్యేక కోర్టు వెలుపల విలేకరులతో అన్నారు.

Chandra Babu : ఒకప్పుడు సెల్‌ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు

97 మందిని ఊచకోత కోసిన నరోడా పాటియా అల్లర్ల కేసులో కొద్నానీ దోషిగా నిర్ధారించారు. అనంతరం ఆమెకు 28 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఆమెను గుజరాత్ హైకోర్టు విడుదల చేసింది. నరోదా గామ్‌లో జరిగిన ఊచకోత 2002లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన తొమ్మిది ప్రధాన కేసుల్లో ఒకటి. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేసింది. నరోదా గామ్ కేసులో 80 మందికి పైగా నిందితులుగా పేర్కొనబడ్డారు. విచారణ సమయంలో 18 మంది చనిపోయారు. నిందితులంతా నిర్దోషిగా విడుదల కావడం నరోదా గామ్ మారణకాండలో మరణించిన వారి కుటుంబాలకు ఎదురుదెబ్బ తగిలిందని ప్రభుత్వ వ్యతిరేకులు అంటున్నారు.

Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

గత ఏడాది నవంబర్‌లో గుజరాత్ ఎన్నికలకు ముందు బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా తేలిన 11 మందికి ఉపశమనం లభించిన తర్వాత తాజా నిర్దోషిగా ప్రకటించడం పెద్ద రాజకీయ తుఫానును లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ తన మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురు కూడా హత్యకు గురైన విషయం తెలిసిందే.