Chandra Babu : ఒకప్పుడు సెల్‌ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు

భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు చంద్రబాబు.

Chandra Babu : ఒకప్పుడు సెల్‌ఫోన్ గురించి చెబితే నవ్వారు, కానీ ఇప్పుడది లేకుండా భార్యాభర్తల్లో ఏ ఒక్కరు ఉండట్లేదు : చంద్రబాబు

Chandrababu at Markapuram

Chandra Babu Naidu : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మార్కాపురంలో మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని ప్రసగించారు. ఈ ప్రసంగంలో చంద్రబాబు టెక్నాలజీ గురించి చెబుతు ఛలోక్తులు విసిరారు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి చెబితే అందరు నవ్వారు కానీ ఇప్పుడు అది లేకుండా ఎవ్వరు ఉండటంలేదని అంతగా టెక్నాలజీ డెవలప్ అయ్యిందని అన్నారు. చిన్నపిల్లలు సెల్ ఫోన్ లేందే ఉండటంలేదన్న చంద్రబాబు భర్త లేకపోయినా భార్యా..భార్య లేకపోయినా భర్తా ఉంటున్నారు గానీ చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఎవ్వరు ఉండటంలేదని ఛలోక్తులు విసిరారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మహిళలు అందరు నవ్వుకున్నారు. టెక్నాలజీతో పాటు మనం కూడా మారాలని టెక్నాలజీని అందిపుచ్చుకుని అభివృద్ధి పథంలో పయలనించాలని అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ హైటెక్ సిటీ ఏర్పాటైంది తెలిపారు. హైదరాబాద్ లో ఐటీ అంటే అందరు నవ్వారని ఇప్పుడు ఐటీలో హైదరాబాద్ ఏ స్థాయిలో అదో పెద్ద ఆదాయ వనరుగా చేసుకుని మహిళలు ఉద్యోగాలకు నెలవుగా హైదరాబాద్ సిటీ మారిందని అన్నారు.

మహిళల ఆత్మీయ సమ్మేళంలో చంద్రబాబు మహిళలు తెలివితేటలు, పట్టుదల, పనితీరుపై ప్రశంసలు కురిపించారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా ఉద్యోగాలు చేస్తున్నారని ఓ పక్క కుటుంబాలను సమర్థించుకుంటో ఐటీ ఉద్యోగాల్లో మహిళలు ప్రతిభ కనబరుస్తున్నారని అలా ప్రతీ మహిళ టెక్నాలజీని అందిపుచ్చుకునవి వారి వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారని ప్రశంసించారు. మగవారితో సమానంగా ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉండాలనే డ్వాక్రా సంఘాలు ఏర్పాటుచేశానని ఈరోజు మహిళలు కుటుంబ ఆర్థిక విధానంలో చక్కటి ప్రతిభకనబరుస్తున్నారని అన్నారు. ఐటీరంగంలో యువతులు యువకులతో సమానంగా దూసుకెళ్తున్నారని..ఆనాడు తాను నాటిన ఐటీ మొక్క నేడుమహావృక్షమై, ఐటీఫలాలను ప్రపంచానికి అందించే స్థాయికి చేరుకుందని ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి పేరు మారుమోగుతోందన్నారు. ప్రపంచంలోని తెలుగువారు అందరూ ఈ గడ్డ రుణం తీర్చు కోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

Andhra Pradesh : 10కిలోమీటర్లు రోడ్డు వేయలేని వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మిస్తుందా? : ఎంపీ రామ్మెహన్ నాయుడు

ఆడపిల్లలకు, మహిళలకు, యువతులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు.మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు.మహిళలు ఇచ్చే సూచనలు కుటుంబాలకు గౌవరంగా ఆర్థిక వనరులుగా ఉంటాయని కితాబిచ్చారు. మీరు సలహాలు ఇస్తే వాటిని ఆచరించి మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని మహిళలకు భరోసా ఇచ్చారు. కుటుంబాల కోసం కష్టపడే మహిళల మేథాశక్తి దేశానికి ఎంతో అవసరమని అటువంటి మహిళలకు తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తాను సీఎం అయ్యాక చేపట్టిన సంస్కరణలను అప్పట్లో అందరు గేలి చేశారని కానీ వాటి ఫలితాలు ఈరోజు కనిపిస్తున్నాయన్నారు.దానికి నిలువెత్తు ఉదాహరణగా హైదరాబాద్ నగరం కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో అనేక సంస్కరణలకు నాంది పలికిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే హైటెక్ సిటీ నిర్మించి సైబరాబాద్ నగరం అభివృద్ధి బీజం వేశామని గుర్తు చేశారు. నిధులు లేకపోయిన సరిపడా డబ్బులు లేకపోయినా ఐదు వేలఎకరాలు సేకరించి, ప్రైవేట్ వారికి అప్పగిస్తే, దేశం గర్వించే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్ లో నిర్మించామని తెలిపారు. జీనోమ్ వ్యాలీని ఏర్పాటుచేశామని దానినుంచే ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ తయారైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 167 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వేయించామని హైదరాబాద్ జంటనగరాల్లోని రోడ్లను వెడల్పు చేయించి ఈరోజున విశాలమైన అంతర్జాతీయ పేరు పొందేలా హైదరాబాద్ రూపుదిద్దుకుందన్నారు.

Rayapati Sambasiva Rao : చంద్రబాబు చెబితే నేను నరసరావు పేట నుంచి పోటీ చేస్తా : రాయపాటి

సాంకేతిక విప్లవంలో భాగంగా నేను సెల్ ఫోన్ గురించి చెబితే అందరూ నవ్వారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఒక్కరైనా ఉన్నారా? భార్య లేకపోయినా ఉండగలరేమో గానీ సెల్ ఫోన్ లేకుండా ఉండలేరు. సెల్ ఫోన్ తోనే అన్నిపనులు చేసేస్తున్నారని చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ తో నే ఆడుకుంటున్నారని వాస్తవాలను ఛలోక్తులుగా చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఐటీ సాంకేతిక అంటే ఒకప్పుడు నవ్వినవారే ఇప్పుడు దానితోనే అన్ని పనులు చేసుకుంటున్నారని మారుతున్న కాలంతో పాటు మనం అందరం మారాలని సూచించారు.