Airports For Sale: అమ్మకానికి ఎయిర్‌పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, విద్యుత్, రైల్వే ఆస్తులు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసు

Airports For Sale: అమ్మకానికి ఎయిర్‌పోర్టులు, స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, విద్యుత్, రైల్వే ఆస్తులు.. కేంద్రం కీలక నిర్ణయం

Airports Sold

Airports For Sale : దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం దారుణంగా పడిపోయింది. నిధుల కొరతతో కేంద్రం అల్లాడుతోంది. ఈ పరిస్థితుల్లో నిధుల సమీకరణ కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక రంగాల్లో వ్యూహత్మక పెట్టుబడుల
ఉపసంహరణకు తెరతీసిన కేంద్రం.. మ‌రిన్ని సంస్థ‌ల‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. వాటి ఆస్తులను అమ్మేయనుంది.

ఎయిర్ పోర్టులు, రైల్వే, రోడ్లు, విద్యుత్, గ్యాస్‌పైప్‌లైన్‌ రంగాల ఆస్తులను విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. మొత్తం రూ.6 ల‌క్ష‌ల కోట్ల నిధుల సేక‌రణే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ చెప్పారు. ఈ మేర‌కు రోడ్‌మ్యాప్ ప్ర‌క‌టించారు. దీని ప్రకారం త్వరలో స్టీల్ ప్లాంట్లు, రోడ్లు, రవాణా సౌకర్యాలతో పాటు పలు ఇన్ ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకోనుంది. ఆయా రంగాల ఆస్తులను అమ్మేయనుంది.

రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా పలు కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 6 ట్రిలియన్లను ఆర్జించాలనుకుంటున్న కేంద్రం.. ఇందులో ఎయిర్ పోర్టులను కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రైవేట్ సంస్ధల చేతుల్లో ఉన్న
ఎయిర్ పోర్టులతో పాటు ప్రభుత్వం చేతుల్లో ఉన్న ఎయిర్ పోర్టుల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని క్రమంగా తెరపైకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

మొత్తంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల్ని ఉపసంహరించే జాబితాలో రహదారులు, రైల్వేలు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ లైన్లు, గ్యాస్ పైప్ లైన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వ్యూహాత్మక రంగాల్ని వదిలిపెట్టి మిగతా అన్నింటిలోనూ పెట్టుబడుల్ని ఉపసంహరించాలని కేంద్రం భావిస్తున్నట్లు
సమాచారం. కరోనా కారణంగా కేంద్రానికి వచ్చే ఆదాయాలు తగ్గడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇలా పెట్టుబడుల ఉపంసహరణ ద్వారా 1.75 లక్షల కోట్లు అర్జించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బడ్జెట్ లో కూడా ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు అమల్లోకి తీసుకురాబోతోంది. అదే జరిగితే కీలక రంగాల్లో ప్రైవేటు సంస్ధల హవా పెరగబోతోంది.

వ్యూహాత్మ‌క పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌లో భాగంగా ఆస్తుల విక్ర‌యాలు చేప‌ట్టినట్టు నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. నిర్ధిష్ట కాలానికి ఆస్తుల అమ్మ‌కం ద్వారా నిధుల స‌మీక‌ర‌ణ‌ను చేప‌ట్ట‌నున్న‌ట్టు ఆమె చెప్పారు. కీల‌క రంగాలు మిన‌హా మిగ‌తా రంగాల‌ను ప్రైవేటీక‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆస్తుల యాజ‌మాన్య హ‌క్కులు మాత్రం ప్ర‌భుత్వానికే ఉంటాయని ఆమె స్ప‌ష్టంచేశారు.

ఈ ఏడాది ఇప్పటికే కేంద్రం ఎల్ఐసీ, బీపీసీఎల్, ఎయిర్ ఇండియాతో పాటు పలు స్టీల్ ప్లాంట్లలోనూ పెట్టుబడుల ఉపసంహరణకు ప్లాన్ ప్రకటించింది. ఏడాది లోపు ఆయా సంస్ధల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడు ఇదే జాబితాలో ఉన్న ఎయిర్ పోర్టుల్లోనూ పెట్టుబడులు
వెనక్కి తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

మానిటైజింగ్ రోడ్ల ద్వారా వచ్చే ఆదాయం 1.6 ట్రిలియన్లు, రైల్వేల నుండి 1.5 ట్రిలియన్లు, విద్యుత్ రంగ ఆస్తులు 1 ట్రిలియన్లు, గ్యాస్ పైప్‌లైన్‌లు 590 590 బిలియన్లు, టెలి కమ్యూనికేషన్ ఆస్తులు 400 బిలియన్లు పొందవచ్చు. పబ్లిక్ గిడ్డంగులు, పౌర విమానయానం, పోర్టు మౌలిక సదుపాయాలు, క్రీడా స్టేడియంలు, మైనింగ్ ఆస్తుల అమ్మకం ద్వారా దాదాపు 1 ట్రిలియన్లు రావొచ్చని అంచనా.

ఆస్తుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం దేశం బడ్జెట్ లోటును తగ్గించడంలో కీలకమైంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తిలో 6.8% గా ఉండాలని కేంద్రం అంచనా వేసింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితులు దిగజారినందున ఆ టార్గెట్ ను రీచ్ కాలేకపోవచ్చని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.