Covid-19: దారుణం: కరోనా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్

కరోనా మనుషుల్లో దూరం పెంచుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు మానవత్వం ఉన్నవారిని కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్‌లాపూర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.

Covid-19: దారుణం: కరోనా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్

Covid 19

Covid-19: కరోనా మనుషుల్లో దూరం పెంచుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు మానవత్వం ఉన్నవారిని కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్‌లాపూర్‌కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని ప్యాక్ చేయకుండా నిర్లక్ష్యం వహించారు. ఓ పీపీఈ కిట్ తొడిగి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులకు సరైన జాగ్రత్తలు కూడా చెప్పలేదు.

మృతదేహం తీసుకోని కుటుంబ సభ్యులు గ్రామానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా గ్రామంలోని బంధువులను కూడా మృతదేహం వద్దకు వెళ్లనివ్వలేదు. వేరే వారి సహకారంతో మృతదేహాన్ని సమీపంలోని పట్టణానికి తీసుకెళ్లి.. ఖననం చేశారు.

ఇక కర్ణాటకలోని మరో ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో ఓ అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని ఫుట్ పాత్ పైనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. అంబులెన్స్ డ్రైవర్ తమను రూ.10,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడని తమ వద్ద మూడు వేలే ఉండటంతో అవి ఇచ్చామని.. దీంతో అతడు మృతదేహాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడని వాపోయారు. వీరి బాధ చూసిన స్థానికులు మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.