Amit Shah : కశ్మీర్ లో పరిస్థితి ఏంటీ..అమిత్ షా హై లెవల్ మీటింగ్ కి ఎన్ఎస్ఏ, రా,ఐబీ చీఫ్ లు హాజరు

జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

Amit Shah : కశ్మీర్ లో పరిస్థితి ఏంటీ..అమిత్ షా హై లెవల్ మీటింగ్ కి ఎన్ఎస్ఏ, రా,ఐబీ చీఫ్ లు హాజరు

Amit Shah Chairs Meeting On Jammu And Kashmir Situation

Amit Shah జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, ఇంటలీజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ అర్వింద్ కుమార్, రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (R&AW) చీఫ్ సమంత్ కుమార్ గోయెల్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) డైరెక్టర్ జనరల్ కుల్‌దీప్ సింగ్‌తో పాటు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి పనుల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. జమ్మూకశ్మీర్ కి అన్ని విధాల అభివృద్ధి మరియు సంక్షేమం మోడీ ప్రభుత్వపు టాప్ ప్రియారిటీ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK) మరియు పశ్చిమ పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు వీలైనంత త్వరగా శరణార్థుల ప్యాకేజీ ప్రయోజనాలను పొందేలా చూడాలని అమిత్ షా అధికారులను కోరారు

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్ షాను కలుసుకున్న అనంతరం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు అభివృద్ధిపై మనోజ్ సిన్హాతో అమిత్ షా చర్చించారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ లో 76శాతం వ్యాక్సినేషన్ మరియు నాలుగు జిల్లాల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేపసినందుకుగాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాని అమిత్ షా అభినందించారు.

మరోవైపు,ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి తాజాగా ఓ లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్ సరిహద్దులు మార్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో ఖరేషి ఫిర్యాదు చేశారు. అయితే విషయమై గురువారం స్పందించిన భారత్.. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, దానిపై మళ్లీ ఎలాంటి ప్రశ్నలు అవసరం లేదని స్పష్టం చేసింNది. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.