Goa Election : గోవాలో కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,మాజీ సీఎంలు కూడా హస్తానికి

Goa Election : గోవాలో కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా

Goa Mla

Goa Election :  వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు,మాజీ సీఎంలు కూడా హస్తానికి హ్యాండ్ ఇవ్వగా..తాజాగా మరో ముఖ్య నాయకుడు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. గోవా కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,కర్టోరిమ్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో లౌరెన్కొ సోమవారం పార్టీకి, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ మధ్యాహ్నం స్పీకర్‌ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అలెక్సో రెజినాల్డో రాజీనామాతో 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ బలం రెండుకి చేరింది.

కాగా,రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం గత వారం కాంగ్రెస్‌ పది మందితో తొలిజాబితా విడుదల చేయగా.. ఇందులో అలెక్సో రెజినాల్డో పేరు కూడా ఉంది. అయినప్పటికీ ఆయన సడన్ గా కాంగ్రెస్ కు హ్యాండివ్వడం ఆ పార్టీకి గట్టి షాక్ అనే చెప్పవచ్చు. అలెక్సో రెజినాల్డో త్వరలోనే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ఎన్నికల్లో 13 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 15మంది ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు-దిగంబర్ కామత్,ప్రతాప్ సింగ్ రానే మాత్రమే ఉన్నారు.

ALSO READ Navjot Sidhu : వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి..సిద్ధూ కీలక వ్యాఖ్యలు