Navjot Sidhu : వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి..సిద్ధూ కీలక వ్యాఖ్యలు

మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఆదివారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను

Navjot Sidhu : వాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి..సిద్ధూ కీలక వ్యాఖ్యలు

Sidhu

Navjot Sidhu : మత విశ్వాసాలను అవమానించే వారిని బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఆదివారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కపూర్తలాలోని గురుద్వారాను అపవిత్రం చేసే ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించిన సిద్ధూ… మందిరాలు, పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే ఘటనల్లో ప్రమేయం ఉన్న వారికి గరిష్ట శిక్ష విధించాలని అన్నారు.

పొరపాట్లు ఎవరైనా చేస్తారు కానీ ఇది పొరపాటు కాదు. సమాజాన్ని బలహీన పరచి, సమాజ వినాశనానికి పాల్పడే కుట్ర ఇది అని సిద్ధూ తాజా ఘటనలను అభివర్ణించారు. అమృత్‌సర్, కపూర్తలాలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను మూకదాడుల్లో కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సీఎం చన్నీ గోల్డెన్ టెంపుల్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లోని మలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో సిద్ధూ మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా దుష్టచర్యలకు పాల్పడుతున్నారని, ఐక్యతావాణిని మనమంతా వినిపించాల్సిన అవసరం ఉంది అని సభకు హాజరైన వారినుద్దేశించి సిద్ధూ వ్యాఖ్యానించారు. మతోన్మాద శక్తులు ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు.

ఒక మతాన్ని ఎక్కువగాను, మరో మతాన్ని తక్కువ చేసి మాట్లాడటాన్ని పంజాబ్ ప్రజలు ఎప్పుడూ వ్యతిరేకిస్తారన్నారు. పంజాబ్‌లో ప్రజలందరూ సమానమేనన్నారు. గురునానక్ చెప్పిన ఏకత్వం, విశ్వమానవ సౌభ్రాతృత్వం అనే పటిష్ట పునాదులపై పంజాబ్ నిర్మాణం జరిగిందని, పంజాబ్ కమ్యూనిటీ సామాజిక కట్టుబాట్లను ఎలాంటి శక్తులు కూడా ధ్వంసం చేయలేవని స్పష్టం చేశారు. ఖురాన్, భగవద్గీత లేదా గురుగ్రంథ సాహిబ్‌లో ఏ మత విశ్వాసాన్ని అయినా దెబ్బతీసే ప్రయత్నం చేసే, అవమానించే దోషులను బహిరంగంగా ఉరితీయాలని, రాజ్యాంగపరమైన అతి పెద్ద శిక్ష విధించాలని సిద్ధూ డిమాండ్‌ చేశారు.

ALSO READ Punjab Amritsar : స్వర్ణ దేవాలయంలో యువకుడు వీరంగం..కొట్టి చంపిన భక్తులు

ALSO READ Gurudwara Temple: గురుద్వారపై జెండాను తొలగించబోయిన వ్యక్తిని కొట్టి చంపిన భక్తులు

ALSO READ New China Ambassador : చైనాలో భారత రాయబారిగా ప్ర‌దీప్ కుమార్ రావ‌త్ నియామకం