Another rail accident : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్‌ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.

Another rail accident : ఒడిశా రాష్ట్రంలో సోమవారం మరో రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ లో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరవక ముందే సోమవారం గూడ్స్ రైలు బార్‌ఘర్ జిల్లా మెంధపలి సమీపంలో పట్టాలు తప్పింది.(Another rail accident)ఒడిశా రాష్ట్రంలోని డుంగురి నుంచి బార్ గఢ్ కు సున్నపురాయిని తీసుకువెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.(goods train carrying limestone derails)
సున్నపురాయితో వెళుతున్న గూడ్స్ రైలుకు చెందిన పలు వ్యాగన్లు సంబర్ధరా సమీపంలో పట్టాలు తప్పాయి.పోలీసులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.ఈ గూడ్స్ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Balasore: బాలాసోర్‌లో రైల్వేట్రాక్ పునరుద్ధరణ…వందేభారత్‌తోపాటు ప్యాసింజర్ రైళ్ల రాకపోకలు షురూ
ఒడిశాలో ట్రిపుల్ రైలు ఢీకొని కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత మళ్లీ గూడ్స్ రైలు పట్టాలు తప్పడం సంచలనం రేపింది. వరుస ప్రమాదాలతో ఒడిశా రాష్ట్రంలో రైల్వే లైన్ల పరిస్థితిపై ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియలేదు.