Kolhapur Clashes: యూపీలో చేసినట్టే వారిని కూడా కాల్చిపారేయాలి.. కొల్హాపూర్ అల్లర్లపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది

Kolhapur Clashes: యూపీలో చేసినట్టే వారిని కూడా కాల్చిపారేయాలి.. కొల్హాపూర్ అల్లర్లపై సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు

Maharashtra Politics: మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో జరిగిన అల్లర్లపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్తులపై జరుగుతున్న ఘటనల్లాగే కొల్హాపూర్ సంఘవిద్రోహ శక్తుల్ని కాల్చిపారేయాలని అన్నారు. బుధవారం జరిగిన ఈ అల్లర్లపై ఆరోజే స్పందిస్తూ.. ఔరాంగాజేబును పొగిడే వారు ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల్లో గెలవడానికి బీజేపీకి ఔరంగాజేబు కావాల్సి వచ్చిందని విమర్శలు గుప్పించారు.

Telangana Elections 2023: మేనిఫెస్టో విడుదలకి, ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవానికి టీపీసీసీ తేదీలు ఖరారు

‘‘ఈ ఘర్షణలో కొల్హాపూర్ ప్రజలు లేరని నేను బలంగా నమ్ముతున్నాను. కొల్హాపూర్ బయటి నుంచి వచ్చిన ప్రజలే ఇందులో ఉన్నారు. వాళ్లే పట్టణంలో పరిస్థితుల్ని ఘర్షణవైపుకు తీసుకెళ్లారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఇలా మాటి మాటికీ జరగుతున్నాయనేది గమనించాలి. వాళ్లు హిందుత్వ గురించి మాట్లాడతారు. కానీ ఇలా విధ్వేషాలు రెచ్చగొట్టడమేనా వారి హిందుత్వ? ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాలా?’’ అని రౌత్ అన్నారు. దీనికి ముందు ఆయన మాట్లాడుతూ ఔరంగాజేబును పొగిడేవారు ఈ దేశంలో ఉండకూడదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ హృదయనేత బాల్ థాకరే, శివసేన పార్టీ సిద్ధాంతమని, దాని మీదే తాము నిలబడతామని అన్నారు.

Delhi Liquor case : మాగుంట రాఘవ బెయిల్ ఉత్తర్వులు సవరించిన సుప్రీంకోర్టు .. జూన్ 12న లొంగిపోవాలని ఆదేశం

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి విషయమించడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీచార్జ్ చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.