Corona death : చనిపోతే ఒక్కరూ రాలేదు కానీ..కర్మకాండల భోజనాలకు మాత్రం ఎగబడి వచ్చారు

తల్లిదండ్రులిద్దరని కోల్పోయిన చిన్నారులు అల్లాడుతుంటే గ్రామంలో ఏ ఒక్కరూ వారిని ఓదార్చటానికి రాలేదు.కానీ అన్నీ తామే అయి తల్లిదండ్రలకు అంత్యక్రియలు నిర్వహించి భోజనాలు పెడితే మాత్రం ఎగబడి వచ్చారు గ్రామస్తులు..తరువాత తమకు రావాల్సి డబ్బులు ఇవ్వాలని వసూలు చేసుకుని మరీ వెళ్లిన ఘటన మానవత్వామా నీవెక్కడ అనిపించింది..

Corona death : చనిపోతే ఒక్కరూ రాలేదు కానీ..కర్మకాండల భోజనాలకు మాత్రం ఎగబడి వచ్చారు

Aria District

Bihr Villagers :  కష్టంలో ఉన్నామంటే ఎవ్వరూ రారు..కనీసం కన్నెత్తి కూడా చూడరు..పన్నెత్తి పలుకరించరు. ఈకరోనా కాలంలో కొంతమంది దాతలు మానవత్వాన్ని చూపుతుంటే..మరికొంతమంది మాత్రం మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. నాలుగు రోజుల్లో కరోనాతో తల్లి..అనారోగ్యంతో తండ్రిని పోగొట్టుకుని దిక్కులేనివారిగా విలపిస్తున్నచిన్నారుల్ని ఆదుకోకపోగా..కనీసం వారికి ధైర్యం చెప్పలేదు.కన్నెత్తి చూడలేదు. అసలు వారి దరిదాపులకే రాలేదు. కానీ చనిపోయిన తల్లిదండ్రకులకు చిన్నారులే అన్నీ తామే అయి కర్మకాండలు చేసిన దశదిన కర్మలు చేస్తే..కర్మకాండల సందర్భంగా పెట్టిన భోజనాలు తినటానికి మాత్రం బంధువులమనీ..స్నేహితులమంటూ ఎగబడి మరీ వచ్చి తిన్నారు. ఆ తరువాత ఆ చిన్నారుల నుంచి డబ్బులువ సూలు చేసి అందినకాడికి లాక్కుపోయారు. వీరా? బంధువులు? ఇటువంటివారా స్నేహితులు? అనే అమానుషం జరిగింది బీహార్ లోని అరియా జిల్లాలో.

అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు. అనాథలయ్యారు. 18 ఏళ్ల సోనీ,14 ఏళ్ల నితీష్, 12 ఏళ్ల చాందినిలు నాలుగు రోజుల్లోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయారు.అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్ చనిపోగా..ఏం చేయాలో తెలియన అయోమయంలో పడి గుండెలవిసేలాఏడ్చారు. ఇంతలోనే తల్లి ప్రియాంకాదేవి క‌రోనాతో చనిపోయింది. అంతే ఇక ఆ ముగ్గురు పిల్లలు అనాథలైపోయారు. బంధువులెవ్వరూ వారిని పట్టించుకోలేదు. కనీసం పలకరించలేదు. దీంతో ఏం చేయాలో ఆ చిన్నారులకు అర్థం కాలేదు.

తల్లిండ్రుల అంత్య‌క్రియ‌ల్ని నిర్వ‌హించటానికి ఏం చేయాలో కూడా తెలియని అమాయకులు వాళ్లు. 18ఏళ్ల ఆడపిల్ల చేతులు చాపి గ్రామ‌స్తుల సహాయం చేయమని కన్నీటితో వేడుకుంది. కానీ ఏ ఒక్కరి మనస్సు కరగలేదు. ఒక్క‌రంటే ఒక్క‌రు ముందుకు రాలేదు. దీంతో పాపం చిన్నవయస్సులోనే పెద్ద భారం మోసింది 18 ఏళ్ల సోని. తండ్రిని..చెల్లిని గుండెల్లో పెట్టుకుని త‌ల్లిదండ్రుల మృత‌దేహాలకు అంత్య‌క్రియలు నిర్వ‌హించింది.

ఆ తరువాత త‌ల్లిదండ్రుల‌కు ద‌శ‌దిన క‌ర్మలు కూడా నిర్వహించింది. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి జరగాలని అన్ని కార్యక్రమాలు నిర్వహించి భోజనాలు కూడా పెట్టింది. అంతకు ముందు సహాయం చేయటానికి ఎవ్వరూ రాలేదు కానీ..దశదిన కర్మల భోజనాలు చేయటానికి మాత్రం గ్రామంలో 150 మంది వ‌చ్చారు.సుష్టుగా తిన్నారు. బాగానే చేశావమ్మాయ్..చిన్నదానివైనా అంటూ పొగిడేశారు. భోజ‌నం చేసాక అసలు విషయం బైటపెట్టారు.వారి అసలు బుద్ధిని బైటపెట్టుకున్నారు. మీ అమ్మానాలు ఆసుపత్రిలో ఉండగా..ట్రీట్మెంట్ కోసం మేం డబ్బులిచ్చాం..మా డబ్బులు మాకు ఇవ్వండీ..అంటూ తాపీగా అసలు విషయాన్ని బైటపెట్టారు. ఆ మాటలు విన్న ఆ చిన్నారులకు నోట మాట రాలేదు. ఏం చేయాలో..ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ తమకన్నవారిమీద మాట పడకూడదనే ఒకే ఒక్క ఆలోచనతో తమ దగ్గర ఉన్న కొద్ది పాటి డబ్బులు వారికి ఇచ్చేశారు. ఏమాత్రం సిగ్గులేకుండా అందిన‌కాడికి అభంశుభం తెలియ‌ని చిన్నారుల నుంచి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసి వాటాలు పంచుకున్నారు.

మనిషిలోని మానవత్వం నిలువునా పాతిపెట్టబడిన ఈ సందర్భంగా పెద్ద‌కుమార్తె సోని మాట్లాడుతూ.. నా తండ్రి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. త‌ల్లి క‌రోనాతో మ‌ర‌ణించింది. అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు గ్రామ‌స్తుల్ని సాయం కోరితే ఒక్క‌రు కూడా ముందుకు రాలేదు. కానీ..ద‌శ‌దిన కర్మ‌కు 150మంది వచ్చారు.పోనీలే వారు కడుపారా భోజనం చేస్తే మా తల్లిదండ్రుల ఆత్మశాంతిస్తుందని అనుకున్నాను..కానీ అలా వ‌చ్చిన వాళ్లు తండ్రి ట్రీట్మెంట్ కు డ‌బ్బులు ఇచ్చామ‌ని..ఆ డ‌బ్బులు మాకు ఇప్పుడే ఇవ్వాలని పట్టుబట్టారు. ఇప్పుడు ఇవ్వలేం అని చెప్పినా వినలేదు..ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడిస్తారు? అంటూ ఒత్తిడి తెచ్చారని దీంతో చేసేదేమీ లేక ఇంట్లో ఉన్న కొద్దిపాటి విలువైన వస్తువులు అమ్మేసి వారు అడిగిన డబ్బులు ఇచ్చేశామని ఆవేదనతో చెప్పింది 18 ఏళ్ల సోనీ.

ఇప్పుడు మేం ఎలా బతకాలో కూడా అర్థం కావట్లేదు..అమ్మానాన్నలను పోగొట్టుకుని ఏడవాలో..ఎలా బతకాలో తెలీక ఏడవాలో అర్థం కావట్లేదంటూ కన్నీటి సముద్రంగా మారిన ఆ పిల్లలు కన్నీటికి ఎవరు సమాధానం చెబుతారు? ఎవరు వారిని అక్కున చేర్చుకుంటారు? ఈ కరోనాకాలంలో ఇటువంటి కన్నీటి గాథలు..ఎన్నో ఎన్నెనన్నో..