BJP-AAP: అరవింద్ కేజ్రీవాల్! జాతీయత ఏంటో తెలియాలంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రండి: బీజేపీ

నిజమైన జాతీయత ఏంటో తెలుసుకోవాలంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి జాతీయవాదంపై మూడేళ్ల కోర్స్ చేయాలనీ వర్మ సూచించారు.

BJP-AAP: అరవింద్ కేజ్రీవాల్! జాతీయత ఏంటో తెలియాలంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రండి: బీజేపీ

Prasanth Varma

BJP-AAP: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతి చిన్న అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కేంద్రంపై నిందలు వేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో పది వేల “తిరంగా శాఖలు” తెరుస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆదివారం స్పందిస్తూ..కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన జాతీయత ఏంటో తెలుసుకోవాలంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చి జాతీయవాదంపై మూడేళ్ల కోర్స్ చేయాలనీ వర్మ సూచించారు. జాతీయ జెండాను పట్టుకు తిరిగినంత మాత్రాన జాతీయవాదిని అంటే ప్రజలు ఒప్పుకోరంటూ ఎంపీ పర్వేశ్ వర్మ ఆమ్ ఆద్మీ నేతకు చురకలంటించారు.

Also read:Hybrid Terrorists: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు “హైబ్రీడ్” టెర్రరిస్టులను పట్టుకున్న భద్రతా బలగాలు

ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్ ఇంచార్జి సంజయ్ సింగ్ శనివారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ తరహాలో రానున్న రోజుల్లో యూపీలో ఆప్ ఆధ్వర్యంలో తిరంగా శాఖలు ఏర్పాటు చేసి వాటికీ ప్రధాన కార్యదర్సులను నియమిస్తామని అన్నారు. రానున్న ఆరు నెలల్లో యూపీ వ్యాప్తంగా 10,000 తిరంగా శాఖలను ఏర్పాటు చేసి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెస్తామంటూ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై యూపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read:Venkaiah Naidu: మరోసారి విశ్వ విజ్ఞాన కేంద్రంగా భారత్: వెంకయ్య నాయుడు

సంజయ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ స్పందిస్తూ..నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైనే విమర్శలు ఎక్కుపెట్టారు. కేజ్రీవాల్ చెబుతున్న జాతీయవాదంపై సందేహం లేవనెత్తిన పర్వేశ్ వర్మ, “నాకు తెలిసి సర్జికల్ స్ట్రైక్స్, కాశ్మీర్ ఫైల్స్ చిత్రం”ను నమ్మే స్థితిలో కూడా కేజ్రీవాల్ లేడంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. నకిలీ జాతీయవాదాన్ని వినిపిస్తున్న కేజ్రీవాల్..ఒక్కసారి ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శిస్తే మనిషిగా మారతాడంటూ పర్వేశ్ వర్మ వ్యాఖ్యానించారు. జాతీయవాదమనేది ప్రజల హృదయాల్లోనూ, ఆలోచనల్లోనూ ఉంటుందని, ఇటీవల యూపీ, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తడబాటుకు గురైన కేజ్రీవాల్ నకిలీ జాతీయవాదాన్ని ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ అన్నారు.

Also Read:Uddhav Thackeray: “మోదీ లేకపోతే గుజరాత్ ఉండదు” బాల థాకరే వ్యాఖ్యలను బయటపెట్టిన సీఎం ఉద్ధవ్