Asaddudin Owaisi : ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం

ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ

Asaddudin Owaisi : ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఒవైసీ ఆగ్రహం

Asaddudin Owaisi

Asaddudin Owaisi : భారత్ లో జనాభా అసమతుల్యత పెద్ద సమస్యగా మారిందని… దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో విజయదశమి సందర్భంగా చేసిన ప్రసంగంలో మోహన్ భగవత్ అబద్ధాలు చెప్పారని ఒవైసీ అన్నారు. మోహన్ భగవత్ సగం సత్యాలు, సగం అసత్యాలు చెప్పారని ధ్వజమెత్తారు. జనాభా నియంత్రణ విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ వ్యాఖ్యలను ఒవైసీ తప్పుపట్టారు.

Breakfast : ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవా?..

ముస్లింల జనాభా పెరగలేదని… తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భగవత్ పునరావృతం చేశారని ఒవైసీ మండిపడ్డారు. వాస్తవానికి ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని స్పష్టం చేశారు. ఇక జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల అక్కడి ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారంటూ మోహన్ భగవత్ చెప్పిన మాటల్లో నిజం లేదని అన్నారు. కశ్మీర్ లో ఎన్నో పౌర హత్యలు జరిగాయని, ఇంటర్నెట్ షట్ డౌన్లు, సామూహిక నిర్బంధాలు సర్వసాధారణమయ్యాయని, కశ్మీర్ రావణకాష్టంలా మారిందని ఒవైసీ విమర్శించారు.

Kidney Stones : కిడ్నీల్లో రాళ్ళు ఎందుకొస్తాయంటే?

బాల్య వివాహాలు, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ల వంటి సామాజిక దురాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని ఎంఐఎం చీఫ్ అన్నారు. స‌గం నిజం, స‌గం అబ‌ద్దం చెప్ప‌డం వ‌ల్ల ఎటువంటి ఉప‌యోగ‌డం ఉండదన్నారు.

కాగా, జనాభా నియంత్రణ విధానాన్ని మరోసారి తీసుకురావాల్సిన అసవరం ఉందని, వచ్చే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించాలని మోహన్ భగవత్ సూచించారు. ఇది అందరికీ సమానంగా వర్తింపజేయాలని, జనాభా అసమతౌల్యత పెద్ద సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజల్ని భయపెట్టడం కోసం ఉగ్రవాదులు హింసను ఆశ్రయిస్తున్నారని ఆయన వాపోయారు.

విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సంఘ్‌ శ్రేణుల్ని ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. పాకిస్తాన్‌, తాలిబన్‌, ఉగ్రవాదం నుంచి జనాభా నియంత్రణ వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్‌ ఏటా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి ఇజ్రాయెల్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొబ్బి షొషానీ అతిథిగా హాజరయ్యారు.