లిక్కర్ షాపు ధర రూ. 510 కోట్లు, ఎవరు దక్కించుకున్నారో తెలుసా ?

రాజస్థాన్‌లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది.

లిక్కర్ షాపు ధర రూ. 510 కోట్లు, ఎవరు దక్కించుకున్నారో తెలుసా ?

Auction of a liquor

liquor store : వేలంలో లిక్కర్ షాపు ధర మా అంటే.. కోటి పలుకుతుంది. యాక్షన్‌లో పోటీ ఎక్కువైతే.. రూ.10కోట్లు పలుకుతుంది. కానీ రాజస్థాన్‌లో ఓ లిక్కర్ షాప్ దేశవ్యాప్తంగా ఉన్న రికార్డులు బ్రేక్ చేసింది. వేలంలో పాల్గొన్న వారితో పాటు.. ఎక్సైజ్ శాఖ అధికారులకు దిమ్మతిరేగే షాక్ ఇచ్చింది. 10కోట్లు కాదు.. 100కోట్లు కాదు ఏకంగా 510 కోట్లు పలికిందా లిక్కర్ షాప్.

రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్‌లోని లిక్కర్ షాప్‌ కోసం ఎక్సైజ్ శాఖ వేలం నిర్వహించింది. గత ఏడాది ఆ షాప్ ధర 65 లక్షలు పలకడంతో… ఈ సారి ఎక్సైజ్‌శాఖ వేలం ప్రారంభ ధరను 72 లక్షలుగా నిర్ణయించింది ఎక్సైజ్ శాఖ. ఉదయం 11గంటలకు ప్రారంభమైన వేలం.. అర్థరాత్రి 2గంటల వరకు సాగింది. వేలంలో షాప్‌ను దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఎవరికి వారు వెనక్కు తగ్గకపోవడంతో.. వేలం పాట కోట్లు.. పదుల కోట్లు.. వందల కోట్లు దాటింది. చివరకు 510 కోట్లకు దుకాణం అమ్ముడు పోయింది.

అందరినీ ఆశ్చర్య పరిచే విషయం ఏంటంటే.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు ఈ షాపుని దక్కించుకున్నారు. గతమెన్నడూ ఈ స్థాయిలో ధర పలకలేదని రాజస్థాన్ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రూ.510కోట్లు పలుకుతుందని తాము ఊహించలేదన్నారు ఆశాఖ అధికారులు.