అయోధ్య కేసు : ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం

  • Published By: madhu ,Published On : November 17, 2019 / 10:35 AM IST
అయోధ్య కేసు : ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం

అయోధ్య కేసుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) సంచలన నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని డిసైడ్ అయ్యింది. తమకు ఐదెకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించింది. మసీదు కోసం దేవాలయాన్ని కూల్చలేదని తెలిపింది. ఇటీవలే అయోధ్య అంశంపై సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకు 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం ముస్లిం పర్సనల్ లా బోర్డు భేటీ అయ్యింది. తీర్పుపై బోర్డు సభ్యులు సమీక్షించారు. తీర్పును సవాల్ చేయాలని నిర్ణయించారు. కానీ పిటిషన్ ఎప్పుడు వేస్తారనేది వెల్లడించలేదు. వారి తరపు న్యాయవాదులతో సమాలోచనలు జరిపిన అనంతరం తేదీని వెల్లడిస్తారని సమాచారం. 

అయోధ్యలో వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమిని హిందూమహాన్యాస్‌కి పంచాలంటూ ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్య పరిసరాల్లో ముస్లింలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలంటూ కేంద్రాన్ని తీర్పులో ఆదేశించింది. ప్రధాన గుమ్మటం కింద రామజన్మభూమి లేదంటూనే భూమిని హిందూన్యాస్ ట్రస్ట్‌కి ఎలా పంచుతారు ? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఫైనల్ తీర్పు చెప్పింది. తాజాగా ఈ కేసును సున్నీ వక్ఫ్ బోర్డు తిరగతోడనుంది. తీర్పు పరస్పర విరుద్ధంగా ఉందంటూ ముస్లిం బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.