క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్, ఇకపై అంత ఈజీ కాదు

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? దాన్ని బాగా వాడుతున్నారా? ఇన్ టైమ్ లో రీపే చెయ్యడం లేదా? పెద్ద మొత్తంలో డ్యూస్ ఉన్నాయా? మీలాంటి వాళ్లకు బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయి.

క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్, ఇకపై అంత ఈజీ కాదు

banks to give shock for credit card holders: మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? దాన్ని బాగా వాడుతున్నారా? ఇన్ టైమ్ లో రీపే చెయ్యడం లేదా? పెద్ద మొత్తంలో డ్యూస్ ఉన్నాయా? మీలాంటి వాళ్లకు బ్యాంకులు షాక్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం క్రెడిట్ కార్డు హోల్డర్ల బకాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ వ్యవహారం బ్యాంకులకు తలనొప్పిగా మారింది. దీంతో అలాంటి వారిపై చర్యలకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. రూల్స్ ని మరింత కఠినతరం చెయ్యనున్నాయి.

అలాంటి వారి క్రెడిట్ లిమిట్ తగ్గించనున్నాయి బ్యాంకులు. అంతేకాదు సిబిల్ స్కోర్ బాగున్నవారికి మాత్రమే ఇక నుంచి క్రెడిట్ కార్డులు ఇవ్వాలని బ్యాంకులు నిర్ణయించాయి. అలాగే రుణాలు మంజూరు చేసే సమయంలోనూ క్రెడిట్ స్కోర్ ని పరిశీలించనున్నాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే కొత్త కార్డు ఇవ్వడం కానీ, క్రెడిట్ లిమిట్ పెంచడం కానీ, లోన్లు ఇవ్వడం కానీ జరుగుతుంది. గతేడాది(2020) మారటోరియం టైమ్ లో మొండిబాకీలు పెరగడంతో బ్యాంకులు ఆ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సో, ఇక నుంచి క్రెడిట్ కార్డులను పొందడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ మధ్య ఆన్ లైన్ లావాదేవీలు బాగా పెరిగాయి. దీంతో క్రెడిట్ కార్డు వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. కోవిడ్-19 భయంతో నగదు లావాదేవీలు తగ్గిపోవడంతో పాటు కార్డు చెల్లింపులు పెరిగిపోవడంతో అన్ని రకాల బిల్ పేమెంట్స్ కు ఎక్కువగా కార్డులు ఉపయోగిస్తున్నారు. దీనికి తగ్గట్టే షాపింగ్ మాల్స్, ఈ-కామర్స్ సైట్లు, బ్యాంకులు క్రెడిట్ కార్డుల మీద రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో చాలామంది తమకు అవసరం ఉన్నా లేకున్నా విపరీతంగా ఖర్చు చేసేస్తున్నారు. ఆ తర్వాత రీపే చెయ్యలేక చేతులెత్తేస్తున్నారు. దీంతో బ్యాంకులకు నష్టం వాటిల్లుతోంది. దీని గురించి బాగా ఆలోచించిన బ్యాంకులు, క్రెడిట్ కార్డు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

క్రెడిట్ కార్డు వాడకం అంటే డ్రగ్స్‌కు బానిసవ్వడమే:
కాగా, ఇటీవలే ఓ అధ్యయనంలో షాకింగ్ విషయం బయటపడింది. క్రెడిట్ కార్డు వాడకం అంటే డ్రగ్స్ కి బానిసవ్వడమే అని అధ్యయనంలో వెల్లడైంది. క్రెడిట్ కార్డుతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే క్రెడిట్​ కార్డుకు అలవాటు పడిన వాళ్లు అవసరం ఉన్నా, లేకపోయినా అదే పనిగా షాపింగ్​ చేస్తుంటారని సర్వేలు చెబుతున్నాయి. క్రెడిట్ కార్డు మత్తులో పడితే తొందరగా బయటికి రాలేరని నిపుణులు అంటున్నారు.

ఎంఐటి అధ్యయనం ప్రకారం.. క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లు చేసే సమయంలో కొకైన్ మాదిరిగానే మెదడులో ఒక రియాక్షన్​ని, ఒక మత్తుని ఏర్పరుస్తుందని సర్వేలో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్​ కార్డు వాడకం మెదడుకు కొకైన్​ మాదిరిగానే కిక్​ ఇస్తుందని పరిశోధకులు అంటున్నారు. క్రెడిట్​ కార్డు ఉపయోగించి షాపింగ్​ చేస్తున్న వారిలో మెదడు ప్రేరేపించ బడుతున్నట్లు తాము కనుగొన్నామని, ఈ చర్య వారికి ఆనందం కలుగజేస్తోందని.. అందువల్ల అవసరం లేకున్నా ఎక్కువ కొనుగోళ్లు చేస్తుండటం పరిశీలించామని పరిశోధకులు చెప్పారు.