కరోనా ఎఫెక్ట్ : పది వేల వెంటిలేటర్లను తయారు చేయనున్న మారుతీ సుజుకీ

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 05:11 AM IST
కరోనా ఎఫెక్ట్ :  పది వేల వెంటిలేటర్లను తయారు చేయనున్న మారుతీ సుజుకీ

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ శనివారం(మార్చి 28, 2020) న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్ ల తయారీ చేపట్టనుంది. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాల కొరతను తీర్చటానికి నెలకు 10000 వెంటిలేటర్లను తయారీకి అగ్వా హెల్త్ కేర్ తో కలిసి పని చేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు మారుతీ సుజుకీ కంపెనీ తెలిపింది.

మారుతీ సుజుకీ తయారు చేసే వెంటిలేటర్స్ కు సాంకేతికత, పనితీరు వంటి వాటిపై కంపెనీ బాధ్యత వహిస్తుందని తెలిపారు. అవసరమైన పరిమాణాలను ఉత్పత్తి చేయటానికి సంస్ధ తన సరఫరాదారులను వినియోగించుకుటుంది. వాటిని తయారు చేయటానికి కావల్సిన టెక్నాలజీని అగ్వాహెల్త్ కేర్ అందించనుంది. ఈ వెంటిలేటర్స్‌ తయారీకి కావాల్సిన డబ్బులు, ప్రభుత్వపరమైన అనుమతులన్నింటిని మారుతీ సుజుకీ భరించి అగ్వా హెల్త్‌కేర్‌కు ఉచితంగా అందించనుంది. నెలకు 10వేల యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేయాలని కంపెని ఉద్దేశ్యం అని తెలిపారు.

వెంటిలేటర్ల తయారీ అనేది యాంత్రిక శ్వాస పరికరం. ఇది ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు గాలిని అందించటంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కోవిడ్ 19 తో బాధపడుతున్న వారు ఎదుర్కొంటున్న సమస్య. వెంటిలేటర్ల తయారు చేయటానికి ధర  రూ.5 నుంచి రూ.12 లక్షల మధ్య ఉంటుంది. భారతదేశంలో రోజురోజుకు కోవిడ్ 19 కేసులు పెరిగిపోతున్నాయి. వీటి సంఖ్య ఇలా పెరిగిపోతుంటే రాబోయే రోజుల్లో వెంటిలేటర్ల కొరత ఏర్పడుతుంది. మే నెల నాటికి 1,10,000 నుంచి 2,20,000 వెంటిలేటర్ల అవసరం ఉందని బ్రూకింగ్స్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశంలో 57వేల వెంటిలేటర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత ప్రభుత్వం వెంటిలేటర్ల తయారీ గురించి ఇప్పటికే మహీంద్రా, టాటా మోటార్స్, హ్యూందాయ్ కంపెనీలతో చర్చించింది. ఈ వెంటిలేటర్ల తయారీని మరింత వేగవంతం చేయటానికి పిఎస్ యులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అశోక్ కపూర్ తో కలిసి ఎంఎస్ఐఎల్ జాయింట్ వెంచర్ అయిన కృష్ణ మారుతి లిమెటెడ్ హర్యానాతో కలసి మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి కేంద్ర ప్రభుత్వాలకు సరఫరా చేయనుంది. ఇంకా భారత్‌ సీట్స్‌ లిమిటెడ్‌తో కలిసి వైరస్‌ నుంచి రక్షణ కల్పించే దుస్తులను తయారు చేయనుంది కంపెనీ తెలిపింది.

Also Read | కాపురంలో కరోనా చిచ్చు : వస్తానన్న భర్త, వద్దంటున్న భార్య