BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 18న ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే?

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

BCCI Elections: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. అక్టోబర్ 18న ఎన్నికలు.. ఫలితాలు ఎప్పుడంటే?

BCCI announces schedule for elections

BCCI Elections: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారి ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. శనివారం రాష్ట్ర సంఘాలకు ఇచ్చిన ఏడు పేజీల లేఖలో రాష్ట్ర యూనిట్లు తమ సభ్యులను నామినేట్ చేయడానికి నిన్నటితో గడువు ముగియగా, అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్లకు గడువు ఉంది. షెడ్యూల్ ప్రకారం.. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగే అక్టోబర్ 18న ముంబైలో ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు సాయంత్రం ఫలితాలు విడుదల అవుతాయి. అక్టోబర్ 4వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జైషా కొనసాగుతున్నారు.

BCCI Secretary Jay Shah: అమిత్ షా తనయుడు జైషాపై ప్రతిపక్షాల విమర్శల దాడి.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు తిరస్కరించిన వీడియో వైరల్

అక్టోబర్ 4న నాటికి సభ్యులు తమ ప్రతినిధిని నామినేట్ చేయడానికి దరఖాస్తులను ఫైల్ చేయాలి. అక్టోబర్ 5న డ్రాప్ట్ ఎలక్టోరల్ రోల్ విడుదల, 6, 7 తేదీల్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌లోని పేర్లపై అభ్యంతరాల సమర్పణ, అక్టోబర్ 10న అభ్యంతరాలు, నిర్ణయాల పరిశీలన, తుది ఓటర్ల జాబితా విడుదల. అదేవిధంగా అక్టోబర్ 11, 12 తేదీల్లో నామినేషన్ దరఖాస్తును ఫైల్ చేయడానికి విండో (వ్యక్తిగతంగా దాఖలు చేయాలి).

BCCI : టీమిండియాతో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా హోం సిరీస్‌ షెడ్యూల్ ఇదిగో..

అక్టోబర్ 13న నామినేషన్ దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. అదేరోజు చెల్లుబాటు అయ్యే నామినేట్ అభ్యర్థుల జాబితా ప్రకటన. 14న మినేషన్ల ఉపసంహరణ గడువు, అక్టోబర్ 15న పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుంది. 18న బీసీసీఐ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు.