సాగనంపినట్టేనా..? : ధోనికి బీసీసీఐ బిగ్ షాక్ 

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 09:05 AM IST
సాగనంపినట్టేనా..? : ధోనికి బీసీసీఐ బిగ్ షాక్ 

మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అంతేకాదు వార్షిక కాంట్రాక్టుల జాబితాలోనూ ధోనీకి చోటు దక్కలేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసింది. ఈ లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా ఏ+ కేటగిరిలో కంటిన్యూ అవుతున్నారు. వారికి రూ.7 కోట్లు లభిస్తుంది.

ధోని పేరు లేకపోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు. ధోనీ ఇంకా రిటైర్మెంట్ ప్రకటిచనే లేదు.. మరి ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదన్నారు. కొంతకాలంగా క్రికెట్ కు ధోనీ దూరంగా ఉన్నాడు. ఏ మ్యాచులకూ ఎంపిక చెయ్యడం లేదు. త్వరలోనే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ధోని మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్ జాబితా హాట్ టాపిక్ గా మారింది. ఇక ధోనిని సాగనంపినట్టేనా? అనే చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది.

Grade A+(రూ.7 కోట్లు)
1. విరాట్ కోహ్లి
2. రోహిత్ శర్మ
3. బుమ్రా

Grade A(రూ.5 కోట్లు)
1. అశ్విన్
2. జడేజా
3. భువనేశ్వర్
4. పుజారా
5. రహానె
6. కేఎల్ రాహుల్
7. ధావన్
8. షమీ
9. ఇషాంత్ శర్మ
10, కుల్దీప్ యాదవ్
11. రిషబ్ పంత్

Grade B(రూ.3 కోట్లు)
1. వృద్దిమాన్ సాహా
2. ఉమేష్ యాదవ్
3. యజువేంద్ర చాహల్
4. హార్థిక్ పాండ్య
5. మయాంక్ అగర్వాల్

Grade C(కోటి రూపాయలు)
1. కేదార్ జాదవ్
2. నవదీప్ సైనీ
3. దీపక్ చాహర్
4. మనీష్ పాండే
5. హనుమ విహారీ
6. శార్దూల్ ఠాకూర్
7. శ్రేయస్ అయ్యర్
8. వాషింగ్టన్ సుందర్

* సీనియర్ జట్టుకు వార్షిక ప్లేయర్ కాంట్రాక్టులకు ప్రకటించిన బీసీసీఐ
* అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు కాంట్రాక్ట్ లిస్టు
* బీసీసీఐ గ్రేడ్ లిస్టులో కనిపించని ధోని పేరు
* గతేడాది లిస్ట్ ఏ లో ధోని పేరు
* ఈ ఏడాది కాంట్రాక్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో ధోని రిటైర్మెంట్ పై ఊహాగానాలు
* గ్రేడ్ A+ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా