Bihar: ఆ రెండు పార్టీల నుంచి జాగ్రత్తగా ఉండండి.. ముస్లింలకు నితీశ్ హెచ్చరిక

నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధావులను ఉద్దేశించి నితీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ క్రియాశీలమవుతుందేమోననే ఆందోళన వ్యక్తం చేశారు

Bihar: ఆ రెండు పార్టీల నుంచి జాగ్రత్తగా ఉండండి.. ముస్లింలకు నితీశ్ హెచ్చరిక

Be careful from those two parties says Nitish to Muslims

Bihar: భారతీయ జనతా పార్టీ, ఆల్ ఇండియా ముస్లీం ఇత్తెహదుల్ ముస్లిమీన్ పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లింలను హెచ్చరించారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. ఆ రెండు పార్టీలు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తాయని ఆయన హెచ్చరించారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో ముస్లిం ఓట్ బ్యాంక్ చెల్లాచెదురవుతుందనే దిగులు నితీశ్‭లో పెరిగిందని, ఆ ఓట్లు ఆర్జేడీ-జేడీయూ కూటమి నుంచి చీలిపోకుండా ఉండేందుకు నితీశ్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే తాజా వ్యాఖ్యలని విమర్శలు వినిపిస్తున్నాయి.

Russian: ఒడిశాలో మరో రష్యన్ మృతి.. రెండు వారాల్లో అనుమానాస్పదంగా మరణించిన మూడో రష్యన్

నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధావులను ఉద్దేశించి నితీశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ క్రియాశీలమవుతుందేమోననే ఆందోళన వ్యక్తం చేశారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ సహా ఏఐఎంఐఎం పార్టీ ప్రయత్నిస్తోందని, ఆ రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ బీజేపీకి బీ-టీమ్ అని ఆరోపించారు. ఓవైసీ వంటివారు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తారని, ఫలితంగా ముస్లిం ఓట్లు చీలిపోతాయని హెచ్చరించారు. బిహార్‌లోని ముస్లింల అభివృద్ధికి జేడీయూ ప్రభుత్వం 18 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేస్తోందని నితీశ్ అన్నారు.

Himachal Pradesh: తన మొదటి జీతాన్ని విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ప్రకటించిన హిమాచల్ సీఎం