BENGAL ELECTION RESULTS 2021 : ఒంటి కాలితో ప్రచారం చేసి గెలిచిన మమత

బెంగాల్‌లో రాయల్‌ టైగర్ గర్జించింది...! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి... వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్‌లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్‌లో నూటికి నూరు శాతం వర్క్‌ అవుట్ అయ్యింది..

BENGAL ELECTION RESULTS 2021 : ఒంటి కాలితో ప్రచారం చేసి గెలిచిన మమత

Bengal Election Results 2021

BENGAL ELECTION RESULTS 2021 : బెంగాల్‌లో రాయల్‌ టైగర్ గర్జించింది…! ఒంటి కాలితో ప్రచారం నిర్వహించి… వీల్ చెయిర్ నుంచి మళ్లీ సీఎం చెయిర్‌లోకి మమత రాబోతున్నారు.. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బెంగాల్‌లో నూటికి నూరు శాతం వర్క్‌ అవుట్ అయ్యింది..

బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేజిక్ ఫిగర్ క్రాస్ చేసిన తృణమూల్ కాంగ్రెస్… డబుల్ సెంచరీని కూడా దాటేశారు. ఒక కాలుకి దెబ్బ తగిలితే ఏంటి.. ఒంటి కాలుతోనే బెంగాల్‌ను గెలుచుకుంటానని శపథం చేసిన కలకత్తా కాళి.. మమతా బెనర్జీ…అన్నట్టే…. తృణమూల్ హవాను కొనసాగించారు.

అయితే బీజేపీ కూడా బెంగాల్‌లో ఈసారి అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో కేవలం మూడంటే మూడు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ… ఇప్పుడు మమతకు వణుకు పుట్టించే స్థాయిలో పుంజుకుంది. మరోవైపు ఒకప్పుడు బెంగాల్‌ను ఏకచత్రాధిపత్యంగా ఏలిన వామపక్షాలు.. ఇప్పుడు బెంగాల్‌ గడ్డపై నామరూపాలు లేకుండా పోయారు. గత ఎన్నికల్లో 76 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ఈసారి… అసలు ఖాతానే తెరవని పరిస్థితి కనిపిస్తుంది..

ఇక బెంగాల్ నుంచి… తమిళనాడు వెళ్తే… తమిళనాడులో అధికార అన్నాడీఎంకే కూటమికి అరవ ఓటర్లు షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కావాలన్న స్టాలిన్ కల నెరవేరబోతోంది. ఇక కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌….చరిత్ర సృష్టించబోతున్నారు. వరుసగా ఏ కూటమికి రెండోసారి అధికారాన్ని కట్టపెట్టే అలవాటు లేని కేరళ ఓటర్లు…మరోసారి ఎల్డీఎఫ్‌ కూటమి అధికారాన్ని చేపట్టబోతోంది