Man Kill Daughter : తిండి పెట్టేందుకు డబ్బు లేదని రెండేళ్ల కూతురిని చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

తిండి పెట్టేందుకు డబ్బు లేదని రెండేళ్ల కూతురిని తండ్రే చంపేశాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ హృయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

Man Kill Daughter : తిండి పెట్టేందుకు డబ్బు లేదని రెండేళ్ల కూతురిని చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

Updated On : November 28, 2022 / 8:24 PM IST

Man Kill Daughter : కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే.. ప్రాణం తీశాడు. తన చేతులతో కన్నబిడ్డను చంపేశాడు. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ హృయవిదారక ఘటన.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది. హృదయాలను మెలిపెడుతోంది. ఇలాంటి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఉద్యోగం పోయింది. వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కూతురును చంపేసుకున్నాడు. రెండేళ్ల వయసున్న కూతురుకు తిండి పెట్టేందుకు డబ్బులేదని ఈ దారుణానికి తెగబడ్డాడు. ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

Also Read.. Delhi Murder: శ్రద్ధా తరహాలో మరో హత్య.. భర్త శవాన్ని పది ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భార్య

గుజరాత్ కు చెందిన రాహుల్ పర్మార్(45) సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భార్యా పిల్లలతో బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. కాగా, 6 నెలల క్రితం రాహుల్ ఉద్యోగం పోయింది. ఇటు బిట్ కాయిన్ బిజినెస్ లోనూ నష్టమొచ్చింది. దీంతో అప్పులపాలైన రాహుల్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. మూడు రోజుల క్రితం కూతురుతో కలిసి బయటకు వెళ్లిన రాహుల్.. తిరిగి రాలేదని ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గాలింపు మొదలుపెట్టిన పోలీసులకు నగర శివార్లలోని కోలార్ తాలూక గ్రామంలోని చెరువు దగ్గర రాహుల్ కారు కనిపించింది. ఆ చెరువులో రాహుల్ కూతురు మృతదేహం బయటపడింది.

కన్నతండ్రే కూతురిని చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బు లేకపోవడంతో కూతురుకు తిండి పెట్టలేనని భావించి హత్యకు పాల్పడినట్లు రాహుల్ పోలీసులతో చెప్పాడు. తనూ ఆత్మహత్యకు ప్రయత్నించినా విఫలమైనట్లు తెలిపాడు.

Also Read : Murder With Fevi Quick : దారుణం.. తన ముందు శృంగారం చేయాలన్న తాంత్రికుడు, ఆ తర్వాత వారి ప్రైవేట్ పార్ట్స్‌పై ఫెవిక్విక్ పోసి చంపేశాడు

కాగా.. వారం క్రితం తన ఇంట్లో నగలు పోయాయని రాహుల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. విచారణలో అది తప్పుడు కంప్లైంట్ అని తేలినట్లు పోలీసులు చెప్పారు. దీంతో రాహుల్ ను స్టేషన్ కు రావాలని సూచించామన్నారు. ఇంట్లోని నగలు తనే కాజేసి, చోరీ కేసు పెట్టిన విషయం పోలీసులు గుర్తించడం, స్టేషన్ కు రావాలని పిలవడంతో రాహుల్ ఆందోళనకు గురయ్యాడని.. పోలీసులు తనపై చర్యలు తీసుకుంటారనే భయంతోనే ఈ దారుణానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కూతురిని చంపడానికి ముందు తాను తన కూతురిని హగ్ చేసుకున్నానని, కాసేపు తనతో సమయం గడిపానని, సరదాగా కాసేపు ఆడుకున్నానని రాహుల్ తెలిపాడు. అదే సమయంలో పాపకు ఆకలి అయ్యిందని, అయితే ఆమెకు తిండి పెట్టేందుకు తన దగ్గర డబ్బు లేదని, దాంతో కూతురిని చంపేశానని అతడు చెప్పాడు. నవంబర్ 15న తన భర్త రాహుల్, కూతురు కనిపించడం లేదని రాహుల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ ఘోరం వెలుగుచూసింది.