Bhagwant Mann: ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్టు.. డిమాండ్లు నెరవేర్చలేకపోతే అవుట్ అంతే

పంజాబ్ సీఎం భగవంత్ మన్ తన క్యాబినెట్‌లోని ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్ ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక నెరవేర్చాల్సిన విషయాలను డిమాండ్ లుగా పేర్కొన్న ప్రజలకు అనుకున్న సమయంలోగా..

Bhagwant Mann: ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్టు.. డిమాండ్లు నెరవేర్చలేకపోతే అవుట్ అంతే
ad

Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మన్ తన క్యాబినెట్‌లోని ప్రతీ మంత్రికి ఒక్కో టార్గెట్ ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చాక నెరవేర్చాల్సిన విషయాలను డిమాండ్ లుగా పేర్కొన్న ప్రజలకు అనుకున్న సమయంలోగా న్యాయం చేయలేకపోతే హోదా నుంచి తప్పిస్తానని చెప్పారు. మూడు రోజుల్లోనే చాలా ప్రాంతాన్ని కవర్ చేసిన ఆయన.. కొత్త ప్రభుత్వం అన్ని అనౌన్స్‌మెంట్లను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

రీసెంట్ గా ముగిసిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున భగవంత్ మన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త సీఎంకు.. పాత మంత్రులకు సెక్యూరిటీ తొలగించి ప్రజలకు భద్రత కల్పించమంటూ కేజ్రీవాల్ సూచనలిచ్చారు. ఇప్పటికే నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించారు.

ఢిల్లీలో మొదలై మంచి స్పందన వస్తున్న యాంటి కరప్షన్ యాక్షన్ లైన్ ప్రాజెక్టును.. రీసెంట్‌గా పంజాబ్ లోనూ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఇంకా మన్ ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ ఉన్న 25వేల పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపారు.

Read Also: ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రమాణ స్వీకారం పూర్తి చేసిన భగవంత్ మన్

రీసెంట్‌గా పంజాబ్‌లోని ఆప్ ఎమ్మెల్యేలతో మీట్ అయిన కేజ్రీవాల్.. ఎమ్మెల్యేలు చండీగఢ్ లో కూర్చొని ఉండటానికి వీల్లేదు. గుర్రమెక్కి పరుగులు పెట్టాలి. పార్టీ ఉద్దేశ్యం ఒకటే. ప్రజల్లోనే ఉండాలి. గ్రామాల్లో తిరగాలి. పంజాబ్ ప్రజలు వజ్రాలను ఎన్నుకున్నారు. భగవంత్ మన్ నేతృత్వంలో మనమంతా 92మంది టీంలా పనిచేయాలి. కేవలం నేను భగవంత్ కు అన్న లాంటి వాడిని మాత్రమే’ అని చెప్పారు.

‘ఢిల్లీలో ఉండి చూస్తూ ఉంటా. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి చేసే పనితీరుపై సర్వే నిర్వహిస్తుంటాం. ఎవరైనా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటే.. వాళ్ల టిక్కెట్ క్యాన్సిల్ చేయించి గెలిచిన మరో వ్యక్తికి ఇచ్చేస్తాం’ అని హెచ్చరించారు కేజ్రీవాల్.