Bharat BioTech : వ్యాక్సిన్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టిన భారత్ బయోటెక్

కొవాగ్జిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరింతగా విస్తరించనుంది. దేశీయంగా తయారీకి ఇండియన్‌ ఇమ్యునొలాజికల్స్‌ లిమిటెడ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్పుడు విదేశీ భాగస్వామ్యం కోసం వెదుకుతోంది.

Bharat BioTech : వ్యాక్సిన్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టిన భారత్ బయోటెక్

Bharat Biotech To Focus On Vaccine Production

Bharat BioTech : కొవాగ్జిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌.. వ్యాక్సిన్‌ ఉత్పత్తిని మరింతగా విస్తరించనుంది. దేశీయంగా తయారీకి ఇండియన్‌ ఇమ్యునొలాజికల్స్‌ లిమిటెడ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ప్పుడు విదేశీ భాగస్వామ్యం కోసం వెదుకుతోంది. అమెరికాలో కొవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ఆక్యూజెన్‌ అనే ఔషధ తయారీ సంస్థతో చేతులు కలిపింది. దీంతో పాటు యూరప్‌కి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఫ్రెంచ్‌ సంస్థ బిగ్గీ సంస్థ కోవాగ్జిన్‌తో చేతులు కలిపేందుకు సుముఖంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్‌ దేశంలో మరణమృదంగం మోగిస్తోంది.

దీంతో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మే 1 నుంచే ఈ వ్యాక్సినేషన్‌ దేశవ్యాప్తంగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే డిమాండ్‌కి తగ్గ స్థాయిలో వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో జరగడం లేదు. దీంతో చాలా రాష్ట్రాల్లో మే 1న 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కాలేదు. కరోనా మ్యూటెంట్లను ఎదుర్కోవడంలో కోవాగ్జిన్‌ పనితీరు మెరుగ్గా ఉందంటూ అంతర్జాతీయంగా అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

దీనికి తోడు కోవాగ్జిన్‌తో సైడ్ ఎఫెక్ట్ వస్తున్న ఘటనలు కూడా ఎక్కడా నమోదు కాలేదు. దీంతో కోవాగ్జిన్‌కు ఇండియాతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరిగింది. దీంతో కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు భారత్ బయోటెక్‌ విదేశీ ఫార్మా కంపెనీలతో టైఅప్‌ అవుతోంది.