స్పీడ్ పెంచిన కరోనా.. ఇండియాలో 24 గంటల్లో 5వేల 611కేసులు

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 04:52 AM IST
స్పీడ్ పెంచిన కరోనా.. ఇండియాలో 24 గంటల్లో 5వేల 611కేసులు

ఇండియాలో కరోనా వ్యాప్తి పేట్రేగిపోతుంది. ఒక్కరోజులో 5వేల 611కేసులు నమోదుకావడంతో మొత్తం కేసులు లక్షా 6వేల 750కి చేరాయి. 3వేల 3వందల 3మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 140మంది చనిపోయారు. కరోనా కేసుల నమోదు లక్ష దాటిన తర్వాత మరింత వేగంగా మారాయని అధికారులు అంటున్నారు. 

రికవరీ రేటు బాగానే ఉన్నా కేసుల నమోదు అంతే వేగమవుతోంది. 42వేల 298మంది రికవరీ అయినట్లు ఆరోగ్య శాఖ చెబుతుంది. కరోనా కేసుల నమోదు మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే ఎక్కువగా కనిపిస్తుంది. మంగళవారం ఒక్కరోజే 688నమోదై మొత్తంగా 12వేల 448కి చేరాయి. రెండో స్థానాన్ని దాటేయడంతో గుజరాత్‌ 12వేల 140కేసులతో మూడో స్థానానికి చేరింది. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే రెడ్ జోన్ ప్రాంతాలైన ముంబై, పూనెలలో ఇళ్ల నుంచి బయటకి రావొద్దని ఆదేశించారు. రాష్టరంలో 37వేల 136కేసులు ఉంటే ఒక్క ముంబైలో మాత్రమే 21వేల 335కేసులు నమోదైయ్యాయి. ఈ పరిస్థితుల్లో ముంబై సిటీకి లాక్‌డౌన్ రిలాక్సేషన్లు కనిపించడం లేదు. 

మహారాష్ట్ర నుంచి తెలంగాణ వచ్చేవారికి పాసులు ఇష్యూ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటు గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి రావొద్దంటూ ఆంక్షలు విధించింది. తెలంగాణలో ఇప్పటి వరకూ వెయ్యి 634కేసులు నమోదయ్యాయి. 

భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికులు ఇంటికి వచ్చిన తర్వాత కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. తిరిగొచ్చిన 50మంది కార్మికులకు కరోనా సోకినట్లు సమాచారం. రాష్ట్రంలో 4వేల 926 కొవిడ్-19కేసులు నమోదు అయ్యాయి. అస్సాంలోనూ కొవిడ్-19 కేసుల నమోదు అంతే వేగంగా ఉంది. అస్సాంలో మొత్తం 142కేసులు కాగా, 24గంటల్లో మాత్రమే 25 కేసులు నమోదయ్యాయి. 

200 కంటే ఎక్కువ రైళ్లు ఏర్పాటు చేసి జూన్ 1నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ World Health Organization (WHO) చైర్మన్ గా మే22న అధికారులు ప్రకటించారు. 

ఈ కరోనా కారణంగా 60మిలియన్ మంది మరో 3ఏళ్లు పేదరికంలోకి వెళ్లిపోతారని వరల్డ్ బ్యాంక్ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 48లక్షల 97వేల 842మందికి కరోనా సోకింది. 3లక్షల 23వేల 287మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో కరోనా కేసులు అధికంగా 91వేల 845 కేసులు నమోదయ్యాయని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ సమాచారం. 

Read: కరోనాను లెక్కచేయలేదు…చివరకు