MK Stalin: విపక్షాల సమావేశానికి సీఎం స్టాలిన్ వెళ్తారా? ఆయనేం అన్నారు?

దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.

MK Stalin: విపక్షాల సమావేశానికి సీఎం స్టాలిన్ వెళ్తారా? ఆయనేం అన్నారు?

MK Stalin

MK Stalin – Lok Sabha Elections 2024: బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా పోరాడాలన్న ఉద్దేశంతో విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సమావేశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ” జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar ) పట్నాలో విపక్షాల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి నేను కూడా హాజరవుతున్నాను ” అని చెప్పారు.

విపక్షాల సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దూరంగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల వేళ విపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సమావేశానికి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.

మా నాన్నలాగే మేము..
మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu project)పై కూడా స్టాలిన్ స్పందించారు. కావేరీ నది ప్రవహించే మేకెదాటు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తామని ఇటీవల కర్ణాటక కొత్త డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో తమిళనాడు నేతలు మండిపడుతున్నారు.

దీనిపై స్టాలిన్ స్పందిస్తూ…” కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాదు.. ఇంతకు ముందున్న బీజేపీ సర్కారు కూడా మేకెదాటు డ్యామ్ నిర్మించాలనుకుంది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిలాగే ఇప్పటి మా ప్రభుత్వం కూడా ఆ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిలబడతాం ” అని స్టాలిన్ చెప్పారు.

Revanth Reddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై రేవంత్ రెడ్డి స్పందన