Viral News: రాత్రివేళ రోడ్డు భలే వేశారు.. ఉదయాన్నే బైక్ పరిస్థితి చూసి కంగుతిన్న స్థానికులు..

రాత్రివేళల్లో రహదారులు నిర్మాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం. రహదారులపై గుంతలు పూడ్చడం, పున: నిర్మాణం చేయడం వంటి పనులు రాత్రివేళల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన పలువురు నెటిజన్లు ఆహా.. రోడ్డు ఇలా వేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు

Viral News: రాత్రివేళ రోడ్డు భలే వేశారు.. ఉదయాన్నే బైక్ పరిస్థితి చూసి కంగుతిన్న స్థానికులు..

Bike In Road (1)

Viral News: రాత్రివేళల్లో రహదారులు నిర్మాణం చేయడం మనం చూస్తూనే ఉంటాం. రహదారులపై గుంతలు పూడ్చడం, పున: నిర్మాణం చేయడం వంటి పనులు రాత్రివేళల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే తమిళనాడులో మాత్రం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిని చూసిన పలువురు నెటిజన్లు ఆహా.. రోడ్డు ఇలా వేయాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం రాత్రివేళల్లో నిద్ర మత్తులో రోడ్డు వేసి ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలో ఏముంది అనేగా మీ డౌట్.. వివరాల్లోకి వెళితే..

Bike In Road 1

Viral News: బంగారు గనుల్లో ‘మమ్మీ’ అవశేషాలు.. 30వేల సంవత్సరాల క్రితం..

తమిళనాడు రాష్ట్రం వెల్లూరులోని కొన్ని ప్రాంతాలలో రోడ్లను పున: నిర్మాణ: చేసే క్రమంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. కలిగంబల్ వీధిలో గత రెండు రోజుల క్రితం సిమెంట్ రోడ్డును పున: నిర్మాణం చేశారు. రాత్రివేళల్లో ఈ రోడ్డు పనులు చేశారు. రాత్రివేళలో చీకట్లో రోడ్డు వేశారో ఏమో కానీ.. రహదారి పక్కనే పార్కింగ్ చేసిన బైక్ ను తొలగించకుండా రోడ్డు వేయడంతో బైక్ చక్రాలు సిమెంట్ రోడ్డులో కలిసిపోయాయి. ఉదయాన్నే స్థానికులు లేచి చూడగా బైక్ పరిస్థితి చూసి స్థానికులు కంగుతిన్నారు. బైక్ చక్రాలు సిమెంట్ రోడ్డు లో ఇరుక్కు పోవటంతో దానిని తీసేందుకు వీలులేకుండా పోయింది. దీంతో రహదారిని పగలగొట్టి ఆ బైక్ ను తీసినప్పటికీ టైర్లు దెబ్బతినడంతో బైక్ యాజమాని కాంట్రాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను తీసి స్థానికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Bike In Road

Disease X: ప్రపంచ దేశాలకు మరో వైరస్ ముప్పు?.. బ్రిటన్ శాస్త్రవేత్తలు ఏమని హెచ్చరించారంటే..

స్థానిక కార్పొరేషన్ప కమిషనర్ పి. అశోక్ కుమార్ ఈ విషయంపై స్పందించారు. కార్పొరేషన్‌కు తెలియకుండానే పనులు జరిగాయని అన్నారు. ఈ సంఘటన విన్న వెంటనే మేము షాక్ అయ్యామన్నారు. ఇది కార్పొరేషన్‌కు చెడ్డ పేరు తెచ్చిందని అన్నారు. అయితే ఆ ప్రాంతంలో రోడ్డు వేయాలని కార్పొరేషన్ తరపున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అన్నారు. రోడ్డు వేయాలంటే టెండర్‌ వేసి తదుపరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి అవగాహన, కార్పొరేషన్ అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ స్థానికులతో కలిసి రోడ్డు వేశారని కమిషనర్ తెలిపారు. ఈ సంఘటనపై ఇంజనీర్ (జోన్-II)కి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు. నేను కూడా సంఘటన స్థలాన్ని సందర్శించానని, మోటారు సైకిల్ ఇరుక్కున్న ప్రదేశం నుండి తొలగించడం జరిగిందని కమిషనర్ తెలిపారు.