Bike Stunt : వర్షపు నీటిలో బైక్ స్టంట్.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

వర్షపు నీటిలో బైక్ స్టంట్ కు యత్నించాడో యువకుడు. బైక్ వేగం ఒక్కసారిగా పెరిగి అదుపుతప్పడంతో స్టంట్ విఫలమైంది.. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ ప్రమాదం నుంచి యువకుడు సురక్షితంగా బయటపడ్డారు.

Bike Stunt : వర్షపు నీటిలో బైక్ స్టంట్.. యువకుడి విఫల ప్రయత్నం చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు

Bike Stunt

Bike Stunt : బైక్ పై స్టంట్స్ చేయడమంటే చాలామందికి ఇష్టం. వీరికి కొంచం సమయం దొరికిందంటే బైక్స్ వేసుకొని రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. రాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చి రేస్ లలో పాల్గొంటుంటారు. కాలుకిందపెట్టి బండిని గిర్రున తిప్పుతారు. బైక్ పై స్టంట్స్ చేస్తూ మెప్పు పొందేందుకు ప్రయ్నస్తుంటారు. ఇలా స్టంట్స్ చేసే సమయంలో ప్రమాదాలకు గురై గాయపడిన వారు చాలామందే ఉన్నారు. ప్రాణాలు కూడా కోల్పోయారు కొందరు. ఇక ఇదిలా ఉంటే ఓ యువకుడు తన బైక్ పై చేసిన స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది.

వర్షపు నీటితో నిండి ఉన్న రోడ్డుపై ఓ యువకుడు స్టంట్ చేసేందుకు ప్రయాణించాడు. బైక్ పై ఎక్కి రయ్యిమని దూసుకుపోవాలని అనుకున్నాడు. ఇదే సమయంలో యువకుడి స్టంట్ చూసేందుకు చుట్టుపక్కలవారు అక్కడి చేరుకున్నారు. తమ మొబైల్స్ బయటకు తీసి ఆ దృశ్యాలను తమ ఫోన్ లో బంధించేందుకు సిద్ధమయ్యారు. అందరు రావడంతో బైక్ ఎక్కి స్టంట్ ప్రారంభించాడు.. బైక్ కొద్దీ దూరం వెళ్ళగానే స్పీడ్ పెంచి ముందు ట్రైర్ లేపాడు.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ముందు టైర్ అమాంతం పైకి లేవడంతో యువకుడు పట్టుకోల్పోయి బైక్ మీది నుంచి కిందకు దిగాడు. ఈ సమయంలో అతడు హ్యాండిల్ పట్టుకొనే ఉన్నాడు. వేగంగా వెళ్లిన బైక్ ప్రహరీ గోడకు తగిలింది. ఈ ప్రమాదంలో గోడ ధ్వంసం కాగా, బండి స్వల్పంగా దెబ్బతింది.

ఇక బైక్ నడిపిన యువకుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తమకు తోచినట్లు స్పందిస్తున్నారు. ‘వావ్‌.. ఏమన్న స్టంటా అని కొందరు అంటే..‘ఇలాంటి ప్రమాదకర స్టంట్‌లు అవసరమా..’ అంటూ మరికొందరు కామెం‍ట్లు చేస్తున్నారు. కాగా ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియరాలేదు.