Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

అగ్గిపెట్టె సమాధానం..బిపిన్‌ రావత్‌..జీవితాన్నే మార్చేసింది. దేశానికి గొప్ప సైనికుడిని అందించింది. సైనికుడి కుమారుడైన రావత్‌.. తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.

Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

Bipin Rawat (7)

Bipin Rawat’s ‘Matchbox’ answer : ఓ అగ్గిపెట్టె.. ఓ బిపిన్‌ రావత్‌..! అవును..! ఆ సమాధానం ఆయన జీవితాన్నే మార్చేసింది..! దేశానికి గొప్ప సైనికుడిని అందించింది. స్వతహాగా సైనికుడి కుమారుడైన రావత్‌.. తండ్రి స్ఫూర్తితో సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో కఠిన పరీక్షలను దాటుకుని ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. అవన్నీ ఎలా ఉన్నా.. సైన్యంలో చేరడానికి తాను ఎదుర్కొన్న తొలి ఇంటర్వ్యూ తనకు ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పేవారు రావత్‌. ఆ రోజు తాను చెప్పిన ‘అగ్గిపెట్టె’ సమాధానమే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చింది అనేవారాయన.

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌కు చెందిన రావత్ ఎప్పుడూ సైన్యంలో చేరాలని కలలు కనేవారు. ఓ సందర్భంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఓ ఘటన పంచుకున్నారు. ఆయన NDAలో చేరేందుకు ప్రిపేర్ అవుతున్నప్పటి ఘటన అది. రావత్‌ NDA పరీక్ష పాసైన తర్వాత UPSE నుంచి ఇంటర్య్వూకి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూ కోసం ఒకప్పటి అలహాబాద్‌ ఇప్పటి ప్రయాగ్‌రాజ్‌కు రావత్ వెళ్లారు. నాలుగైదు రోజుల ట్రైనింగ్, టెస్టింగ్ తర్వాత కొందర్ని ఫైనల్‌ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. అందులో రావత్ ఒకరు. ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులంతా రూమ్‌ బయట నిల్చొని ఉన్నారు. ఒక్కొక్కర్నీ గది లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Chandrababu : అమర జవాన్ సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి : చంద్రబాబు

ఆ సమయమే జీవితంలో చాలా ముఖ్యమైన నిమిషాలని రావత్ గ్రహించారు. NDAలోకి వెళ్లాలన్నా… బయటకు వెళ్లిపోవాలన్నా ఇదే ముఖ్యమని రావత్ భావించారు. ఈ ఆలోచలు మెదడులో కదులుతుండగానే బోర్డు సభ్యులు రావత్‌ను పిలిచారు. లోపలికి వెళ్లి చూస్తే అంతా పెద్దపెద్ద వాళ్లే. బ్రిగేడియర్ ర్యాంక్ ఉన్న వ్యక్తులే ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఓ కుర్రాడిని చూసిన అక్కడి బోర్డు సభ్యులు చాలా స్నేహపూర్వకంగా మెలిగారు. నాలుగైదు సింపుల్ ప్రశ్నలే అడిగారు. క్రమంగా భయం పోగొట్టారు.

ఆ తర్వాత ఓ సభ్యుడు రావత్ హాబీలు అడిగారు. తడుముకోకుండా ట్రెక్కింగ్ అంటే ఇష్టమని రావత్ చెప్పారు. వెంటనే మరో ప్రశ్న దూసుకొచ్చింది. నాలుగైదు రోజుల ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుకుంటే నీతో ఏం తీసుకెళ్తావని బోర్డు సభ్యుడు క్వశ్చన్ చేశారు. రావత్‌ తీవ్రంగా ఆలోచించి… నాలుగైదు రోజుల ట్రెక్కింగ్‌కు వెళ్లాలనుంటే అగ్గిపెట్టె తీసుకెళ్తానని చెప్పారు. ఆశ్చర్యపోయిన ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు ఎందుకు అగ్గిపెట్టే తీసుకెళ్తావు అని డౌట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. అగ్గిపెట్టే ఉంటే ట్రెక్కింగ్‌లో చాలా పనులు చేసుకోగలనని రావత్ చెప్పారు. అగ్ని అనేది ఆదిమమానవుడి అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణ అని.. అది మానవాళి పరిణామానికి దోహదం చేసిందంటూ తన సమాధానాన్ని రావత్‌ కంటిన్యూ చేశారు.

Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

అగ్గిపెట్టె ఆవిష్కరణను ఆదిమమానవుడు తన విజయంగా భావించాడని.. అందుకే, తాను కూడా ట్రెక్కింగ్‌ సమయంలో ఇది అత్యంత ముఖ్యమైన వస్తువుగా భావించానిట్లు రావత్‌ చెప్పారట. ఆ ఒక్క వస్తువులో చాలా పనులను సులభంగా చేసుకుంటానన్నారు రావత్‌. అయితే రావత్‌ను సమాధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి చేశారు బోర్డు సభ్యులు. కానీ ఆయన తన సమాధానంపై గట్టిగా నిలబడ్డారు. కొద్ది రోజుల తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయినట్లు రావత్‌కు లేఖ వచ్చింది. ఎంత ఒత్తిడిలోనైనా తన జవాబుపై రావత్‌ గట్టిగా నిలబడటమే ఇంటర్వ్యూ ఎంపికలో కీలక పాత్ర పోషించిందని రావత్‌ అంటారు.