BJP Focus On TS : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్..ప్రధానితో సహా కేబినెట్ హైదరాబాద్ తరలిరానుందా?

బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్‌ ఢిల్లీలో చేస్తున్న మంత్రాంగం ఏంటి? 

BJP Focus On TS : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్..ప్రధానితో సహా కేబినెట్ హైదరాబాద్ తరలిరానుందా?

Bjp Focus On Telangana (1)

bjp focus on telangana..: బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్‌ ఢిల్లీలో చేస్తున్న మంత్రాంగం ఏంటి? తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం.. కాషాయ జెండా ఎగురేస్తామన్న మోదీ స్పీచ్‌ తర్వాత టీ-బీజేపీ నేతల్లో జోష్ పెరిగింది. కేంద్ర అధినాయకత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో.. కాషాయ సైనికులు దూసుకుపోతున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఢీకొట్టేది తామేనని నిరూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం అటెన్షన్.. డైవర్షన్ కాకుండా బీజేపీ కీలక కార్యక్రమాలకు తెలంగాణను కేంద్రంగా మారుస్తున్నారు. త్వరలోనే ప్రధానితో పాటు కేంద్ర కేబినెట్ మొత్తం హైదరాబాద్‌లో మకాం వేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Also read : Telangana Podu Lands : పోడు భూముల పోరుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ స‌ర్కార్

తెలంగాణ సీఎం కేసీఆర్… బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీయేతర నేతలను ఒకొక్కరుగా కలుస్తూ.. భవిష్యత్ వ్యూహలు రచిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. రెండుమూడు నెలల్లో సంచలన నిర్ణయం ఉండబోతోందంటూ ప్రకటన కూడా చేసేశారు. ఈక్రమంలో.. తమ టార్గెట్ తెలంగాణే అని బీజేపీ చెప్పకనే చెబుతోంది. కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో ఉంటే.. కాషాయ దళం తెలంగాణలో పాగా వేసే పనులు మొదలు పెట్టింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇటీవల ప్రధాని మొదలు, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నడ్డా తెలంగాణ పర్యటనలు అందులో భాగమేనంటోంది రాష్ట్ర కాషాయ దళం.

జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు సంబంధించి నాలుగైదు రాష్ట్రాలకు జాతీయ అధినాయకత్వం ఆహ్వానం పంపింది. అయితే తాము నిర్వహిస్తామంటూ టీ-బీజేపీ నేతలు ముందుకొచ్చారు. తెలంగాణలో పొలిటికల్ టెంపో క్రియేట్ చేయడమే లక్ష్యంగా.. రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని అధిష్టానానికి తెలిపారు. బండి ప్రతిపాదనకు ఓకే చెప్పిన అధినాయకత్వం.. భాగ్యనగరంలోనే సమావేశాలు నిర్వహించేదుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. జులై మూడో వారంలో సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. వేదికకు అనువైన స్థలాలను టీబీజేపీ నేతలు అన్వేషించారు. నోవాటెల్, హైటెక్స్, ఎన్‌కన్వెన్షన్, తాజ్‌కృష్ణ, తాజ్‌ డెక్కన్ , తాజ్ బంజారా హోటల్‌ను పరిశీలించారు.

Also read : Srilanka Parliament: భారత్ ను ఉదహరిస్తూ శ్రీలంక పార్లమెంటులో సమూల మార్పులు ప్రతిపాదించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే

జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బీజేపీ జాతీయ నాయకత్వం మొత్తం తెలంగాణలోనే మకాం వేయనుంది. ప్రధానితో పాటు కేంద్ర కేబినెట్ మొత్తం హైదరాబాద్‌లో ఉండనుంది. వారితో పాటు 18రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 29రాష్ట్రాల అధ్యక్షులు, బీజేపీ జాతీయ నేతలు కూడా ఇక్కడే ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు 2004లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. భాగ్యనగరంలో జరిగాయి. బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సమావేశాలు నిర్వహించారు. దాదాపు 18ఏళ్ల తర్వాత మళ్లీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణను ఎంచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది.