Sudhir Gupta : అమీర్​ ఖాన్ లాంటివారి వల్లే జనాభా పెరుగుతోంది : BJP MP వివాదాస్పద వ్యాఖ్యలు

‘భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటివారే కారణం’ అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. మొదటిభార్యతో ఇద్దరు పిల్లల్ని కని..ఆమెకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా కిరణ్ రావు ను వివాహం చేసుకుని ఆమెతో ఓ బిడ్డను కని ఇప్పుడు మూడో భార్యకోసం అమీర్ వెతుకుతున్నారని..ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం ఇదేనా? అంటూ వ్యాఖ్యానించారు.

Sudhir Gupta : అమీర్​ ఖాన్ లాంటివారి వల్లే జనాభా పెరుగుతోంది : BJP MP వివాదాస్పద వ్యాఖ్యలు

Aamir Khan For 'population Imbalance'

Aamir Khan for ‘Population Imbalance’ మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ లో జనాభా పెరగటానికి అమీర్ ఖాన్ లాంటివారే కారణం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదటిభార్యతో ఇద్దరు పిల్లల్ని కన్నాక..ఆమెకు విడాకులు ఇచ్చి రెండో భార్యగా కిరణ్ రావు ను వివాహం చేసుకుని ఆమెతో ఓ బిడ్డను కని ఇప్పుడు మూడో భార్యకోసం అమీర్ వెతుకుతున్నారని..ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం ఇదేనా? దేశంలో జనాభా అసమానతలకు అమీర్ ఖాన్ లాంటివారే కారణం’ అంటూ మధ్యప్రదేశ్ లోని మాండ్సర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కాగా..ఇటీవల అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం (జులై 11) జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఎంపీ సుధీర్ గుప్తా ఎంపీ సుధీర్ గుప్తా మాట్లాడుతూ..అమిర్ ఖాన్ మొదటి భార్య రీనాతో ఇద్దరు పిల్లలను కన్నారు. రెండో భార్య కిరణ్ తో ఒక సంతానం ఉంది. ఇప్పుడు ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోవటానికి రెడీగా ఉన్నారు. అమీర్ మూడో భార్య కోసం వెతుక్కుంటున్నారు. ప్రపంచానికి భారత్ ఇచ్చే సందేశం ఇదేనా? అని అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో జనాభా అసమానతలకు ఆమిర్ ఖాన్ లాంటి వారే కారణం కావడం దురదృష్టకరమన్నారు.

గత పదేళ్లలో భారత భూభాగం పెరగకపోయినా.. జనాభా మాత్రం పెరిగిపోయిందన్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిదికాదనీ..దేశ విభజన సమయంలో ఎక్కువ భూభాగం, తక్కువ జనాభాతో పాకిస్థాన్ ఏర్పాటైందని ఈ సందర్భంగా గుప్తా గుర్తు చేశారు. కాబట్టి జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి అమీర్ ఖాన్- కిరణ్ రావులు చరమగీతం పాడారు. వీరిద్దరూ వైవాహిక జీవితంలో తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ని సరోగసీ ద్వారా కన్నారు. కిరణ్ రావుని వివాహం చేసుకోకముందు అమీర్ రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈక్రమంలో మరి ఏం జరిగిందో గానీ అమీర్ ఖాన్ రెండో భార్యకు కూడా విడాకులు ఇవ్వనున్నారు.