MCD Mayor Polls: బీజేపీ బిగ్ యూటర్న్.. ఎంసీడీ మేయర్ ఎన్నికలో ఆప్‭ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కమల పార్టీ

కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాుల మాత్రమే సాధించింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మేయర్ అయ్యుండేవారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

MCD Mayor Polls: బీజేపీ బిగ్ యూటర్న్.. ఎంసీడీ మేయర్ ఎన్నికలో ఆప్‭ను ఢీ కొట్టేందుకు సిద్ధమైన కమల పార్టీ

BJP U turn on MCD mayor polls

MCD Mayor Polls: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికపై భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకుంది. ఈ ఎన్నికలో పోటీ చేస్తామని మంగళవారం పార్టీ ప్రకటించింది. వాస్తవానికి ఈ ఎన్నికలో పోటీ చేయడం లేదని ముందు ప్రకటించిన బీజేపీ, స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలిపింది. అయితే తమకు ఎదురొచ్చే దమ్ము లేక స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేసిన అనంతరం, తామే పోటీకి దిగుతున్నట్లు బీజేపీ ప్రకటించడం గమనార్హం.

Musa Hasahya: 12 భార్యలు, 102 సంతానం అంనతరం సంచలన ప్రకటన చేసిన ఓ వ్యక్తి

బీజేపీ నుంచి మేయర్ అభ్యర్థిని సైతం ఖరారు చేశారు. షాలిమర్ బాఘ్ వార్డు కార్పొరేటర్ రేఖా గుప్త ఈ పదవికి పోటీ పడుతున్నట్లు పార్టీ తాజాగా ప్రకటించింది. ఇక రాంనగర్ వార్డు కొర్పొరేటర్ కమల్ బగ్రి డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నారు. ఇకపోతే ఆప్ నుంచి మేయర్ అభ్యర్థిగా ఈస్ట్ పటేల్ వార్డు కొర్పొరేటర్ షెల్లి ఒబేరాయ్‭ని ఆప్ అధిష్టానం ప్రకటించింది. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా చందని మహాల్ వార్డు కొర్పొరేటర్ మహ్మద్ ఇక్బాల్‭ను పోటీకి దింపారు.

Rahul Gandhi To Lord Ram: రాహుల్ గాంధీ రాముడట, భారత్ జోడో యాత్ర రామాయణమట.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 250 స్థానాల్లో ఆ పార్టీ 134 స్థానాలు గెలుచుకుంది. ఇక 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని ఏలుతున్న బీజేపీ కేవలం 104 స్థానాలను మాత్రమే సాధించింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉంటే ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా మేయర్ అయ్యుండేవారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.