BJP vs BJP: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య రగిలిన పాత చిచ్చు.. అట్టుడుకుతోన్న ఇరు రాష్ట్రాలు

BJP vs BJP: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య రగిలిన పాత చిచ్చు.. అట్టుడుకుతోన్న ఇరు రాష్ట్రాలు

Bommai remarks, Fadnavis response: What is the Maharashtra-Karnataka border dispute

BJP vs BJP: రెండు రాష్ట్రాల మధ్య ఏ తగువులైనా ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఉధృతంగా ఉంటాయి. ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే ప్రభుత్వాలు, పార్టీలు ఎలాగూ లేవు కాబట్టి, వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని ఎంత వరకు వీలైతే అంత వరకు వాడుకుంటారు. కానీ, రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే, దాదాపుగా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ప్రజల నుంచి ఇలాంటి డిమాండ్లు ఉంటే, చర్చలు చేస్తున్నామని, కమిటీలు వేస్తున్నామని ఏదో చెప్పి తప్పించుకుంటారు.

కానీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులంతా 2024లో బీజేపీని ఓడించడానికి ఏకమవుతుంటే మహా, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. వీళ్లు ఇలా కత్తులు నూరుకోవడానికి కారణం సరిహద్దు వివాదం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఈనాటిది కాదు. అప్పుడెప్పుడో 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ నాటి నుంచి కొనసాగుతూనే ఉంది.

Rajastan: పైలట్ సీఎం అవ్వడం లేదా, పైలట్‭ను సీఎం కానివ్వడం లేదా? ఇంతకీ సీఎం గెహ్లాట్ ఏమంటున్నారు?

కర్ణాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు తమవేనని మహారాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు తమవేనని కర్ణాటక ప్రభుత్వం.. ఇలా చాలా కాలంగా వాద ప్రతివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని బెలగావి మాదేనని మహారాష్ట్ర అంటుంటే, మహారాష్ట్రలోని షోలాపూర్ మాదేనని కర్ణాటక అంటోంది. అప్పుడప్పుడు ఇరు రాష్ట్రాల్లో రాజకీయ నిప్పును రగుల్చుతోన్న ఈ రగడ.. తాజాగా మరోసారి పైకి లేసింది. అంతే.. ఇటు కర్ణాటక సీఎం బొమ్మై, అటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి.

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయి. ఇదే విషయాన్ని ఇటీవల కర్ణాటక సీఎం బొమ్మై ప్రస్తావించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు ఒత్తిడి తేవడంతో, జాట్ తీర్మానం 2012లో జరిగిందని, అయితే ఏ గ్రామమూ ఇప్పుడు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు సిద్ధంగా లేదని ఫడ్నవీస్ సమాధానం చెప్పారు. ఇంతటితో ఆగకుండా బెల్గాం, కార్వార్, నిపాని వంటి మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోని తీసుకొచ్చేందుకు కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతోందని అన్నారు.

Supreme Court: ఈసీ అనిల్ గోయెల్ నియామకం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం

అంతే, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సరిహద్దు సమస్యపై ఫడ్నవీస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని, తమ భూమిని, నీటిని, సరిహద్దులను రక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని అన్నారు. ఈయనా మరొక అడుగు ముందుకు వేసి కన్నడ మాట్లాడే షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని, అందుకోసం న్యాయ పోరాటం చేస్తామని బొమ్మై అన్నారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దు తగాగాపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వం మహాజన కమిషన్ అనే కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ 1960లోనే ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తోసి పుచ్చింది. కొన్ని దశాబ్దాల ప్రతిష్టంబన అనంతరం 2004లో సుప్రీంకోర్టును మహా ప్రభుత్వం ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు పెండింగులోనే ఉంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయం యుద్ధం అయితే కొనసాగుతోంది.

Jama Masjid: మగ తోడు లేకుండా మహిళలు మసీదులో రాకూడదట.. వివాదాస్పదమవుతోన్న జామా మసీదు నిర్ణయం