Modi’s Security : ప్రధాని భద్రతా వైఫల్యం..సుప్రీంకోర్టు విచారణ

ఎవరి మీదో నెపం నెట్టేయాలి అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేదేముందని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఒకవేళ షోకాజ్ నోటీసులపై సందేహాలు ఉంటే..కేంద్ర కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని

Modi’s Security : ప్రధాని భద్రతా వైఫల్యం..సుప్రీంకోర్టు విచారణ

Breach In PM Modi’s Security : ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది. ఈ మేరకు ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ధర్మాసనం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ విచారణకు సుప్రీం ధర్మాసనం ప్రతిపాదించింది. ఈ కమిటీలో చండీఘడ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, రిజిస్ట్రార్ జనరల్, ఐబీ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఉండనున్నారు. ప్రధాని పంజాబ్ ప్రయాణ రికార్డులను భద్రపరచాలని ఇప్పటికే చండీఘడ్ హైకోర్టు రిజిస్టార్ జనరల్ ను ఆదేశించింది. ప్రధాని భద్రతా వైఫల్యంపై ఇప్పటికే దర్యాప్తు కమిటీలు కేంద్ర హోం శాఖ, పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత శుక్రవారం నాడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2022, జనవరి 10వ తేదీ సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు జరిగిన విచారణలో పంజాబ్ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

Read More : NASA : ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కంటే విలువైన గ్రహశకలం..దీన్ని భూమ్మీదకు తెస్తే అందరు బిలియర్లే

క్రమశికణా చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ తమ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని, కేంద్రం చేస్తున్న దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదని, స్వతంత్య దర్యాప్తు కోరుతున్నామని కోర్టు దృష్టికి పంజాబ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (SPG) నిబంధనలకు సంబంధించి బ్లూ బుక్ వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందట పెట్టారు. నిబంధనలన్నింటినీ తు.చ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత పంజాబ్ డీజీపీదే అని తుషార్ మెహతా వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ ఆగిన ప్రదేశానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే నిరసన కారులు ఉన్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఉదయం నుండే అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నా..ఆ విషయాన్ని డీజీపీకి తెలియపరచలేదన్నారు. ఆ రాష్ర్ట ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందన్న ఆయన ఇంటెలిజెన్స్ ఐజీదే బాధ్యత అని స్పష్టం చేశారు.

Read More : police Mustache : మీసం పెంచుకున్నాడని కానిస్టేబుల్ సస్పెండ్..ఇది నా పరువు..తీసేదేలేదంటున్న రాణా

కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై న్యాయమూర్తులు సూర్యాకాంత్, హిమాకోహ్లి లు పలు సందేహాలు వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యం వాస్తవం, రాష్ర్ర్టం కూడా ఒప్పుకోవాల్సిందే అయితే జరుగుతున్న విషయాలు సందేహాలు లేవనెత్తుతున్నాయని జస్టిస్ సూర్యాకాంత్ కోర్టుకు తెలిపారు. మేము ఆదేశాలు ఇచ్చాక కూడా 24 గంటల్లో షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వమని రాష్ర్ట అధికారులను కోరడం ఏంటీ ? జస్టిస్ హిమాకోహ్లి ప్రశ్నించారు. అధికారులపై క్రమశికణా చర్యలు తీసుకోవాలనుకుంటున్నప్పుడు కోర్టు చేయాల్సింది ఏముందని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. ఎవరి మీదో నెపం నెట్టేయాలి అనుకుంటున్నప్పుడు ఇక తాము చేసేదేముందని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ఒకవేళ షోకాజ్ నోటీసులపై సందేహాలు ఉంటే..కేంద్ర కమిటీ దర్యాప్తు జరిపి నివేదిక సమర్పిస్తుందని.., అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోమని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తెలిపారు. కేంద్ర కమిటీలో కేబినెట్ సెక్రటరీ, ఎస్పీజీ ఐజీ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ లున్నారని..తాము తప్పు చేసినట్లు వారు ఇప్పటికే నిర్దారణకు వచ్చారన్నారు. కాబట్టి ఈ కమిటీపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర్య దర్యాప్తు జరిపించాలని పంజాబ్ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మరోసారి సుప్రీంకోర్టుకు కోరారు.