Bride Beat Groom: పెళ్లైన గంటకే వరుడి చెంప పగులగొట్టిన వధువు

పోలీసులు నచ్చచెప్పి నవ వధువును అత్తగారింటికి పంపే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె పోలీసుల మాట కూడా వినకుండానే తల్లిగారింట్లో ఉండిపోయింది. తాను తన ప్రియుడినే చేసుకుంటానని తెగేసి చెబుతుంది నవవధువు. ఇక చేసేది ఏమి లేక వరుడి బంధువులు ఇంటికి వచ్చారు. కాగా ఈ ఘటనకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Bride Beat Groom: పెళ్లైన గంటకే వరుడి చెంప పగులగొట్టిన వధువు

Bride Beat Groom

Bride Beat Groom: దేశంలో వింత సంఘటనకు కొదవే లేదు.. ప్రతి నిమిషం ఎదో ఓ చోట వింతలు, విశేషాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని గుట్టుగా ఉండాల్సిన విషయాలు కూడా రట్టై వార్తలుగా మారి ప్రజల ముందుకు వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్ళైన కొద్దీ సేపటికే పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు చెంప పగలగొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ లో చోటుచేసుకుంది. పెళ్లి మండపం మీద నుంచి దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో వధువు వరుడిని లాగిపెట్టి ఒక్కటి ఇచ్చింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి పెళ్లిబట్టలు తీసి పక్కన పడేసి మాములు బట్టలు ధరించి పుట్టింటికి వెళ్ళింది. వధువు, వరుడిని కొట్టిన ఘటన చూసి కొందరు షాక్ కి గురయ్యారు. ఇక వధువు పుట్టింటికి వెళ్ళగానే వరుడి బంధువులు వధువు ఇంటికి వెళ్లి గొడవకు దిగారు.

గొడవ పెద్దది కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపారు. అయితే పోలీసులు యువతిని పక్కకు పిలిచి ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తను ప్రేమించిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో ఆగ్రహంతో చేయి చేసుకున్నాని తెలిపింది.