India - Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ | BSF Soldiers fires on Pakistan drug smugglers in Punjab border

India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్

శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్​ గురుదాస్​పుర్​లోని చందూ వదాలా పోస్ట్​ వద్ద పాక్​ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.

India – Pak Border: భారత్ పాక్ సరిహద్దుల్లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్

India – Pak Border: సరిహద్దు వెంట పాకిస్తాన్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఉగ్రమూకల డ్రోన్లపై గురిపెట్టిన భారత భద్రతాదళాలు..సరిహద్దు వెంట డ్రగ్స్ సరఫరాపైనా నిఘా ఉంచారు. ఈక్రమంలో భారత్​లోకి అక్రమంగా డ్రగ్స్​ సరఫరా చేస్తున్న పాక్​ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం 5.15 గంటల సమయంలో పంజాబ్​ గురుదాస్​పుర్​లోని చందూ వదాలా పోస్ట్​ వద్ద పాక్​ స్మగ్లర్ల కదలికలను గమనించిన బిఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరిపారు.

Also read: TS High Court: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ హాజరైన డీహెచ్

వారు ప్రతిఘటించడంతో కొంతసేపు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. భారత దళాలు తీవ్రంగా ప్రతిఘటించి.. పాక్ ముఠాను తరిమికొట్టారు. కాల్పుల సమయంలో ఒక బీఎస్​ఎఫ్​ జవానుకు గాయాలు అయినట్లు బీఎస్​ఎఫ్​ డీఐజీ తెలిపారు. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్​తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న చైనీస్​ పిస్టల్​, ఏకే 47 తుపాకులు, పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం భారత భద్రతా సిబ్బంది చేసుకున్నారు.

Also read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సందిగ్థత?

×