Credit కార్డుతో పెట్రోల్ కొంటున్నారా? లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు ఎలా ప‌నిచేస్తాయి? ఎవ‌రు ఉప‌యోగించాలి? డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు ఏంటి? ఈ కార్డుల‌ను ఉప‌యోగించేవారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి?

Credit కార్డుతో పెట్రోల్ కొంటున్నారా? లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Credit Card

Credit Card : కొత్త కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు క్రెడిట్ కార్డు సంస్థలు ఇంధ‌న ఖ‌ర్చుపై డిస్కౌంట్లు, రివార్డులు, క్యాష్ బ్యాక్‌లు ఆఫ‌ర్ చేస్తున్నాయి. కొన్ని సంస్థ‌లు బీపీసీఎల్‌, హెచ్‌పీ వంటి ఆయిల్ కంపెనీలతో క‌లిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల‌ను తీసుకొస్తున్నాయి. భార‌త్ పెట్రోలియం భాగ‌స్వామ్యంతో ఎస్బీఐ కో-బ్రాండెడ్ రూపే కాంటెక్ట్‌లెస్ కార్డును తీసుకొచ్చింది. ఇలా చాలా క్రెడిట్ కార్డు సంస్థ‌లు ఇంధ‌న కొనుగోలుపై ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డులు ఎలా ప‌నిచేస్తాయి? ఎవ‌రు ఉప‌యోగించాలి? డిస్కౌంట్లు, రివార్డు పాయింట్లు ఏంటి? ఈ కార్డుల‌ను ఉప‌యోగించేవారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి?

భార‌త్ పెట్రోలియం భాగ‌స్వామ్యంతో ఎస్బీఐ ఈ వారంలోనే కో-బ్రాండెడ్ రూపే కాంటెక్ట్‌లెస్ కార్డును లాంచ్ చేసింది. ఇలా చాలా క్రెడిట్ కార్డు సంస్థ‌లు ఇంధ‌న కొనుగోలుపై ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. అయితే ఈ క్రెడిట్ కార్డులు ఎలా ప‌నిచేస్తాయి? ఎవ‌రు ఉప‌యోగించాలి? ఈ కార్డుల‌ను ఉప‌యోగించేవారు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఏంటి?

Curry Leaves : కరివేపాకు కొలెస్టరాల్ ను తగ్గిస్తుందా..?

ఫ్యూయల్ కార్డులు ఎవ‌రికి ఉప‌యోగం..
సొంత వాహ‌నాలు ఉండి ఎక్కువ‌గా ప్ర‌యాణించే వారికి ఫ్యూయల్ కార్డులు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటాయి. ఇంధ‌న కొనుగోలు ఎక్కువ‌గా ఉంటే రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఎక్కువ‌గా ఉంటాయి. డ‌బ్బు ఆదా అవుతుంది. క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థ‌లు చ‌మురు సంస్థ‌ల‌తో క‌లిపి ఈ కార్డుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అన్‌లాక్ చేసేందుకు కొన్ని ష‌రతుల‌ను విధిస్తున్నాయి. సాధార‌ణంగా రోజువారీ లేదా నెల‌వారీ ఇంధ‌న వినియోగం ఎక్కువ‌గా ఉన్న‌వారికి ఇంధ‌న కార్డులతో ఎక్కువ రివార్డు పాయింట్లు వ‌స్తాయి.

Exercise : వ్యాయామం మెదడుకు మేలు చేస్తుందా?

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు..
ఇంధ‌న ఖ‌ర్చును ఆదా చేసేందుకు ఫ్యూయ‌ల్ కార్డును తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తుంటే.. జాయినింగ్ ఫీజుతో పాటు యానువల్ ఫీజు ఉంటాయి. అందు వ‌ల్ల‌ కార్డుకు అయ్యే ఖ‌ర్చును తెలుసుకోవాలి. కొన్ని సంస్థ‌లు వార్షిక వినియోగానికి కొంత టార్గెట్‌ పెడతాయి. అంతకుమించి ఖ‌ర్చు చేస్తే యానువల్ ఫీజు మాఫీ చేస్తాయి. ఒక వేళ ఖ‌ర్చు చేయ‌డంలో విఫ‌లమైతే మొత్తం పొదుపుపై ప్ర‌భావం చూపుతుంది. అందువ‌ల్ల మీరు కార్డు జారీ చేసిన సంస్థ‌లు తెలిపిన దానికంటే ఎక్కువ ఇంధనంపై ఖ‌ర్చు చేయ‌గ‌లం అనుకుంటే మాత్ర‌మే కార్డును తీసుకోవ‌డం మంచిది. నెల‌వారీ ఇంధ‌న ఖ‌ర్చుల‌తో కార్డు ఉప‌యోగిస్తే అయ్యే ఖ‌ర్చుల‌ను పోల్చి చూడండి.

పెట్రోల్ పంప్‌ల‌ జాబితా:
కో-బ్రాండెడ్ కార్డుల విష‌యంలో భాగ‌స్వామి కాని రీఫిల్ స్టేష‌న్‌లో చేసే కొనుగోళ్ల‌పై లాయ‌ల్టీ రివార్డు పాయింట్లు వ‌చ్చే అవ‌కాశం ఉండదు. అందువల్ల వినియోగ‌దారులు తాము ఎక్కువ‌గా ఆయిల్ కొనుగోలు చేసే పెట్రోల్ పంపును నిర్ధారించుకోవాలి. అలాగే ఖర్చు చేసిన మొత్తంపై రివార్డు పాయింట్లు పొంద‌గ‌ల లేదా రీడీమ్ చేసుకోగ‌ల‌ భాగ‌స్వామ్య ఆయిల్ పంపుల జాబితాను రూపొందించుకుని అందుకు త‌గిన కార్డును తీసుకోవాలి.

రివార్డు పాయింట్లు, వెల‌క‌మ్ బోన‌స్‌:
సేక‌రించిన రివార్డు పాయింట్ల‌ను సాధార‌ణంగా భాగ‌స్వామ్య ఔట్ లెట్స్ దగ్గర వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఎంపిక చేసిన ఆన్‌లైన్ భాగ‌స్వామ్యులు లేదా గిఫ్ట్ ఓచ‌ర్ల రూపంలో రీడీమ్ చేసుకునేందుకు కొన్ని కార్డు జారీ సంస్థ‌లు అనుమ‌తిస్తున్నాయి. రివార్డు పాయింట్ల విష‌యంలో గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విష‌యం ఎక్స్‌పైరీ డేట్‌. చాలా వ‌ర‌కు ఫ్యూయ‌ల్ క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్ల‌కు 2 నుంచి 3 సంవ‌త్స‌రాల గ‌డువు ఉంటుంది. కొన్ని జారీ సంస్థ‌లు గడువు తేదీ లేకుండానే కార్డుల‌ను జారీ చేస్తున్నాయి. ఈ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొత్త‌గా కార్డు తీసుకునే వారికి కొన్ని సంస్థ‌లు జాయినింగ్ బోన‌స్ లేదా వెల్‌క‌మ్ బోన‌స్‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. కాబ‌ట్టి కొత్త‌గా కార్డు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు వీటిని ప‌రిశీలించాలి.

స‌ర్‌ఛార్జీ మిన‌హాయింపు:
చాలావ‌ర‌కు ఫ్యూయ‌ల్ బేస్డ్‌ క్రెడిట్ కార్డులు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన‌ప్పుడు 3 శాతం వ‌ర‌కు స‌ర్‌ఛార్జ్ వ‌ర్తించొచ్చు. మీ కార్డుపై కూడా ఈ స‌దుపాయం ఉంటే కొంత లేదా పూర్తి స‌ర్‌ఛార్జ్ మిన‌హాయింపు పొందొచ్చు. ఇది కార్డును బ‌ట్టి మారుతుంటుంది.

ఫైనాన్స్ ఛార్జీలు:
కార్డు బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించాలి. గ‌డువు తేదీలోపు క్రెడిట్ కార్డు బిల్లుల‌ను పూర్తిగా చెల్లించ‌డంలో విఫలమైతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కార్డు, అది జారీ చేసిన సంస్థ‌పై ఆధార‌ప‌డి 23 శాతం నుంచి 49 శాతం వ‌ర‌కు ఉంటాయి.

భారత్ పెట్రోలియం భాగస్వామ్యంతో ఎస్బీఐ లాంచ్ చేసిన co-branded RuPay contactless కార్డుతో ప్రతి వంద రూపాయల ఇంధన కొనుగోలుపై 13x రివార్డు పాయింట్లు లభిస్తాయి. అలాగే రూ.4వేల కన్నా ఎక్కువ లావాదేవీ జరిపినప్పుడు 1శాతం ఫ్యూయల్ సర్ చార్జి మినహాయింపు లభిస్తుంది. అయితే భారత్ పెట్రోలియం పంపుల్లో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.